బుల్లితెరపై రాంబో | Sylvester Stallone executive producing 'Rambo' TV series | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై రాంబో

Published Wed, Dec 2 2015 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

బుల్లితెరపై రాంబో

బుల్లితెరపై రాంబో

హాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరీస్లలో ఒకటైన రాంబో త్వరలో బుల్లితెర మీద సందడి చేయనుంది. సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమా సీరీస్ను టీవీ సీరియల్గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్కు రాంబో ఫిలింస్లో హీరోగా నటించిన స్టాలోన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.

సినిమా తరహాలో కాకుండా ఈ టీవీ సీరియల్లో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాంబో, అతని కొడుకు మధ్య అనుబంధం నేపథ్యంలో కథా కథనాలు రెడీ చేస్తున్నారు. సినిమా సీరీస్లో ఎక్కడా రాంబోకు కొడుకు ఉన్నట్టు చూపించలేదు. కేవలం టీవీ సీరీస్ కోసమే ఈ కథను రెడీ చేస్తున్నారు.

1982లో తొలిసారిగా రాంబోగా కనిపించిన సిల్వస్టర్ స్టాలోన్, ఆ తరువాత నాలుగు భాగాల్లో అదే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సీరీస్ తోనే యాక్షన్ స్టార్గా భారీ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రాంబోతో పాటు ద ఎక్స్పాండబుల్స్ సీరీస్ను కూడా టీవీ షోగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు స్టాలోన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement