ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన! | I need privacy, please dot disturb, says Sanjay Dutt | Sakshi
Sakshi News home page

ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన!

Published Wed, Jun 1 2016 3:36 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన! - Sakshi

ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన!

ముంబయి బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి విడుదలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పిన సంజయ్.. హాలీవుడ్ మూవీ రీమేక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాంబో మూవీని హిందీలో సంజయ్ చేస్తున్నాడు. ఈ మూవీలో చాలా యాక్షన్ సీన్లలో హీరో చాలా సీరియస్ పాత్రలో కనిపించాలి. గతంలో మాదిరిగా ఫిట్ గా కనిపించేందుకు సంజయ్ చెమటోడుస్తున్నాడు.

అందులో భాగంగా సంజయ్ మూవీ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. ఎలా చిక్కిందో ఏమో గానీ, గ్లోవ్స్ తో సంజయ్ ఉన్న ఓ ఫొటో లీక్ అయింది. ఇక అంతే సంజయ్ కాస్త అప్ సెట్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు కాస్త ప్రైవసీ కావాలని, ప్రతి విషయంలో మా వెంట పడాలని భావించరాదని సూచించాడు. తన ఫొటోలు తీసి లీక్ చేస్తే, అభిమానులు అంచనాలతో అక్కడికి వస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు. షైఫు కనిష్క శర్మ వద్ద సంజయ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ కానుంది. ప్రి ప్రొడక్షన్ పనులు అన్నీ ముగిసినట్లు కథనాలు వస్తున్నాయి.

తన పాలీ హిల్ ఇంట్లో గుట్టుగా సినిమా కోసం కసరత్తులు చేస్తున్న సంజయ్.. మమ్మల్ని ఇలా వదిలేయండీ, అభిమానులకు డైవర్ట్ చేసి వారు ఇక్కడికి వచ్చేలా చేసి తనకు, మూవీ యూనిట్ కు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవద్దని విజ్ఞప్తిచేశాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ఆయన కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్న విషయం మరోసారి వెల్లడైందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement