జైల్ జిమ్‌దగీ | Jail Jim | Sakshi
Sakshi News home page

జైల్ జిమ్‌దగీ

Published Sun, Jan 4 2015 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జైల్ జిమ్‌దగీ - Sakshi

జైల్ జిమ్‌దగీ

కటకటాలు లెక్కపెట్టు చోట కసరత్తులు చేయరా బేటా... అంటూ పాడుకుంటున్నారట సంజయ్‌దత్‌ను ఇప్పుడు చూసినవాళ్లు. ఐదేళ్ల కారాగార వాసం తర్వాత మన సంజూబాయ్ రీసెంట్‌గా బెయిల్ మీద రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. ఎండకన్నెరుగని ఈ బాలీవుడ్ స్టార్...  కొరకొర ఖాకీల మధ్య అరకొర వసతుల దెబ్బకు అల్లాడిపోయి ఉంటాడని, భిక్షలాగ వేసే భోజనంతో బక్కచిక్కి బిక్కమొగం వేసుకుని బయటకొస్తాడని అనుకున్న వారు ఇప్పుడు సంజూబాబా రూపం, ఫిట్‌నెస్ చూసి కళ్లు తేలేస్తున్నారు. జైలు నుంచి బోలెడంత ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కాదు సిక్స్‌ప్యాక్‌ను కూడా వెంటపెట్టుకుని వచ్చి 18 కిలోల బరువు తగ్గి ఇప్పుడు చెక్కిన శిల్పంలా తయారయ్యాడు ఈ బాలీవుడ్ స్టార్.

జైలు ప్రవేశం చేసిన తొలిరోజుల్లో లోపలకి డంబెల్స్ కూడా తీసుకెళదామని సంజయ్ ట్రై చేస్తే... అధికారులు ‘నై భయ్ నై’ అన్నారట. దీంతో ఎక్విప్‌మెంట్లూ గట్రా అవసరం లేకుండా పుషప్స్, పులప్స్, స్క్వాట్స్, క్రంచెస్... వగైరాలన్నీ ప్రిజనర్స్ టైంటేబుల్ ప్రకారం కానిచ్చిన మన ఖల్‌నాయక్... డంబెల్స్‌కు బదులుగా ఏం వాడి ఉంటారనుకున్నారు?నిండుగా నీళ్లున్న రెండు బకెట్లు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement