సూపర్‌ హీరోకి కరోనా ఎఫెక్ట్‌ | Sylvester Stallone is Samaritan on two week hiatus over coronavirus outbreak | Sakshi
Sakshi News home page

సూపర్‌ హీరోకి కరోనా ఎఫెక్ట్‌

Published Tue, Mar 17 2020 12:10 AM | Last Updated on Tue, Mar 17 2020 12:10 AM

Sylvester Stallone is Samaritan on two week hiatus over coronavirus outbreak - Sakshi

సిల్వెస్టర్‌ స్టాలోన్‌

కరోనా దెబ్బకు సూపర్‌ హీరో కాస్తా వెనక్కి తగ్గాడు. రెండు వారాల పాటు తన యూనిట్‌ని ఇంటిపట్టున ఉంచాలనుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సూపర్‌ హీరో మూవీ ‘సమారిటన్‌’. ఈ చిత్రం షూటింగ్‌ గత వారం జార్జియాలో జరిగింది. అయితే కోవిడ్‌ 19 ఎఫెక్ట్‌కి ఈ సూపర్‌ హీరో చిత్రం షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చారు. రెండు వారాల తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇందులో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ పారిశుధ్య కార్మికుడి పాత్ర చేస్తున్నారు. ఆయన ఓ నిర్మాత కూడా. ఓవర్‌లార్డ్‌ జూలియస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement