Shooting brake
-
బన్నీకి కరోనా.. రెండు రోజులు ఆగితే అది పూర్తయ్యేది
పుష్పరాజ్ ప్లాన్‌ను కరోనా అడ్డుకుంది. పుష్పరాజ్ యాక్షన్‌కు బ్రేక్ వేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో బన్నీ (అల్లు అర్జున్) పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తారు. అయితే అల్లు అర్జున్‌కు కరోనా సోకడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ జస్ట్ రెండంటే రెండు రోజులు బన్నీ షూట్లో పాల్గొన్నట్లయితే తను చేయాల్సిన యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యేదట. మరోవైపు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న మలయాళ నటుడు షాహద్ ఫాజల్, అనసూయలపై ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తీయాల్సింది. ఇప్పుడు దీనికి కూడా బ్రేక్ పడింది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. -
సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’
ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు. మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే... మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ముంబయ్‌లో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. ‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్‌కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది. మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. -
హైదరాబాద్‌కి అన్నాత్తే
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ జోష్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ‘తలైవా (నాయకుడు)ని ఇంత జోష్‌గా చూడడం ఆనందంగా ఉంది’ అంటున్నారు రజనీ అభిమానులు. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు అస్వస్థత కారణంగా రజనీ ఆస్పత్రిలో చేరిన విషయం, డిశ్చార్జ్ అయి చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సినిమా యూనిట్లో అప్పుడు నలుగురు కరోనా బారినపడడం వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. మూడు నెలలు ఇంటిపట్టునే ఉండి, విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్ ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్లో చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దరువు’ శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నా షూటింగ్ చేసేసి, దీపావళి సందర్భంగా నవంబర్ 4న ‘అన్నాత్తే’ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
లాల్‌సింగ్ వాయిదా పడ్డాడు
ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘లాల్‌సింగ్ చద్దా’. టామ్‌హ్యాంక్స్ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం మొదట ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన బ్రేక్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. అందువల్ల ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్రబృందం పేర్కొంది. ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రం షూటింగ్ త్వరలో మళ్లీ ఆరంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విజయ్ సేతుపతి బాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. -
19 నుంచి తమిళ చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్
తెలుగు చిత్రాల షూటింగ్స్ని ఆపివేయాలని ఆదివారం తెలుగు ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా ఆగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి షూటింగ్స్ని ఆపివేస్తామని ‘ఫెఫ్సీ’ (దక్షిణ చలన చిత్ర కార్మికుల సమాఖ్య) సోమవారం ప్రకటించింది. ‘‘భారీ నష్టం జరుగుతుంది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. నిర్ణయాలకు కట్టుబడాలి. మా కార్మికుల క్షేమమే మాకు ముఖ్యం. నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరూ మా నిర్ణయాన్ని ఆమోదించి ఈ 19 నుంచి షూటింగ్స్ ఆపివేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ‘ఫెఫ్సీ’ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణను కూడా నిలిపివేయమని కోరారు. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలుపెట్టాలన్నది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని కూడా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విక్రమ్ ‘కోబ్రా’, అజిత్ ‘వలిమై’, శింబు ‘మానాడు’ చిత్రాల విదేశీ షెడ్యూల్స్ రద్దయ్యాయి. అన్ని చిత్రాల షూటింగ్స్ నిలివేయాలని సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలుగు స్టూడియోలు ఖాళీగా ఉన్నట్లే తమిళ స్టూడియోలు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి. -
సూపర్ హీరోకి కరోనా ఎఫెక్ట్
కరోనా దెబ్బకు సూపర్ హీరో కాస్తా వెనక్కి తగ్గాడు. రెండు వారాల పాటు తన యూనిట్‌ని ఇంటిపట్టున ఉంచాలనుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ ‘సమారిటన్’. ఈ చిత్రం షూటింగ్ గత వారం జార్జియాలో జరిగింది. అయితే కోవిడ్ 19 ఎఫెక్ట్‌కి ఈ సూపర్ హీరో చిత్రం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. రెండు వారాల తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇందులో సిల్వెస్టర్ స్టాలోన్ పారిశుధ్య కార్మికుడి పాత్ర చేస్తున్నారు. ఆయన ఓ నిర్మాత కూడా. ఓవర్లార్డ్ జూలియస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మూడు నెలలు బ్రేక్
బ్రేక్ లేకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి నమ్రత తెలిపారు. ‘‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేశ్ మూడు నెలలు విరామం తీసుకోవాలనుకుంటున్నారు. ‘మహర్షి’, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలను పెద్ద గ్యాప్ లేకుండా పూర్తి చేశారు. అందుకే ‘సరిలేరు...’ తర్వాత హాలిడే ప్లాన్ చేయాలనుకుంటున్నారు. మహేశ్ గురించి నాకు తెలుసు కాబట్టి.. నెల విరామం తీసుకున్న తర్వాత మళ్లీ పని చేయాలనుకుంటారు’’ అని పేర్కొన్నారు నమ్రత. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
వైజాగ్ టు హైదరాబాద్
క్లాస్ హీరోగా కనిపించే నాగశౌర్య యాక్షన్ సీన్స్‌లో కూడా అదుర్స్ అనిపించగలరు. ‘ఛలో’ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి. ఈ కిక్‌ను మరింత అందించాలనే ఆలోచనలో ఉన్నారు నాగశౌర్య. అందుకు తగ్గట్లుగా తన తాజా చిత్రంలో రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్లోనే నాగశౌర్య కాలికి గాయమై షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కొంచెం విరామం తీసుకున్న తర్వాత షూట్లో పాల్గొన్నారు నాగశౌర్య. ఈ షెడ్యూల్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘కేజీఎఫ్’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు ఆథ్వర్యంలో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. -
చిల్ సెల్ఫీ
సందడి సందడిగా షూటింగ్లో పాల్గొంటూ షాట్ గ్యాప్‌లో చిల్ అవుతుంటారు నటీనటులు. సరదాగా సెల్ఫీకు ఫొజులిస్తుంటారు కూడా. అలాంటిదే ఇది. ‘వెంకీ మామ’ షూటింగ్ గ్యాప్‌లో నాగచైతన్యతో రాశీఖన్నా క్లిక్ చేసిన సెల్ఫీ ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా కేయస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. -
నయనతార షూటింగ్‌కు బ్రేక్
ఉదయనిధి, నయనతార జంటగా నటిస్తున్న నన్బేండా చిత్రం షూటింగ్‌కు బ్రేక్ పడింది. తంజావూరు మణిమండపం సమీంలోని ఆంగ్లేయుల పాలనా కాలంలో నిర్మించిన చెరసాల ఉంది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ అనాథ శరణాలయంగా నియోగించుకుంటున్నారు. ఇక్కడ నన్బేండా చిత్రం షూటింగ్ నిర్వహించాలని భావించిన చిత్ర యూనిట్ అందుకు సన్నాహాలు చేసుకుంది. చిత్ర యూనిట్ షూటింగ్‌కు సిద్ధమయ్యూరు. ఆ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి పొందలేదన్న విషయం తెలియడంతో అక్కడి నిర్వాహకులు అనుమతి లేకుండా చిత్రీకరించరాదంటూ అడ్డుకోవడంతో పాటు చిత్ర యూనిట్‌ను అక్కడ నుంచి తరిమేశారు. దీంతో చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ప్రభుత్వ అనాథ శరణాలయంలో షూటింగ్ తీయూలంటే, చెన్నైలోని ప్రజా సంక్షేమ శాఖ అధికారి అనుమతి పొందాల్సి ఉంటుం ది. అయితే చిత్ర యూనిట్ అనుమతి కోరుతూ అధికారికి లేఖ రాశారు. దాని నఖలును ఆ శాఖ కార్యాలయం చిత్ర యూనిట్‌కు ఇచ్చింది. ఆ నఖలు పత్రాన్ని అనాథ శరణాలయం నిర్వాహకులకు చూపి షూటింగ్ నిర్వహించాలని ప్రయత్నించింది. దీంతో అధికారులు నన్బేండా చిత్ర షూటింగ్‌ను అడ్డుకున్నట్లు తెలిసింది.