నయనతార షూటింగ్‌కు బ్రేక్ | nayanthara nanbenda movie Shooting brake | Sakshi
Sakshi News home page

నయనతార షూటింగ్‌కు బ్రేక్

Published Thu, Jul 10 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

నయనతార షూటింగ్‌కు బ్రేక్

నయనతార షూటింగ్‌కు బ్రేక్

 ఉదయనిధి, నయనతార జంటగా నటిస్తున్న నన్బేండా చిత్రం షూటింగ్‌కు బ్రేక్ పడింది. తంజావూరు మణిమండపం సమీంలోని ఆంగ్లేయుల పాలనా కాలంలో నిర్మించిన చెరసాల ఉంది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ అనాథ శరణాలయంగా నియోగించుకుంటున్నారు. ఇక్కడ నన్బేండా చిత్రం షూటింగ్ నిర్వహించాలని భావించిన చిత్ర యూనిట్ అందుకు సన్నాహాలు చేసుకుంది. చిత్ర యూనిట్ షూటింగ్‌కు సిద్ధమయ్యూరు. ఆ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి పొందలేదన్న విషయం తెలియడంతో అక్కడి నిర్వాహకులు అనుమతి లేకుండా చిత్రీకరించరాదంటూ అడ్డుకోవడంతో పాటు  చిత్ర యూనిట్‌ను అక్కడ నుంచి తరిమేశారు.
 
 దీంతో చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ప్రభుత్వ అనాథ శరణాలయంలో షూటింగ్ తీయూలంటే, చెన్నైలోని ప్రజా సంక్షేమ శాఖ అధికారి అనుమతి పొందాల్సి ఉంటుం ది. అయితే చిత్ర యూనిట్ అనుమతి కోరుతూ అధికారికి లేఖ రాశారు. దాని నఖలును ఆ శాఖ కార్యాలయం చిత్ర యూనిట్‌కు ఇచ్చింది. ఆ నఖలు పత్రాన్ని అనాథ శరణాలయం నిర్వాహకులకు చూపి షూటింగ్ నిర్వహించాలని ప్రయత్నించింది. దీంతో అధికారులు నన్బేండా చిత్ర షూటింగ్‌ను అడ్డుకున్నట్లు తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement