Udayanidhi
-
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు -
విక్రవాండికి.. ఉదయనిధి!
సాక్షి, చైన్నె: విక్రవాండి ఉప ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన నేత, మంత్రి ఉదయ నిధి రెండు రోజుల పాటుగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈవీఎంలలో చిహ్నాలను పొందు పరిచే కార్యక్రమంతో పాటు, పోలీసుల తపాల్ ఓట్ల నమోదు ప్రక్రియను గురువారం ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పళణి పర్యవేక్షించారు.వివరాలు.. విక్రవాండి అసెంబ్లీ స్థానానికి ఈనెల 10వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివాకు మద్దతుగా మంత్రులు ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గ్రామగ్రామానా తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పీఎంకే అభ్యర్థి సి. అన్బుమణికి మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి అభినయకు మద్దతుగా ఆ పార్టీ నేత సీమాన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచార ప్రయాణానికి డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఈనెల 7,8 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 8 గ్రామాలలో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించే విధంగా డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.పోస్టల్ ఓట్ల నమోదు..ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమయం సమీపించడంతో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పళణి మాట్లాడుతూ, పోలీసులకు తపాల (పోస్టల్) ఓట్ల నమోదు తాలుకా కార్యాలయంలో శనివారం వరకు జరగనున్నట్లు వివరించారు. 370 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 574 మంది తమ తపాల్ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంలలో చిహ్నాలు, అభ్యర్థుల పేర్లను పొందు పరిచే పనులు శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 పోలింగ్ బూత్‌లలో వెలుపలు, పరిసరాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.44 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామని, ఇక్కడ పారా మిలటరీ భద్రతకు నిర్ణయించామన్నారు. ఈనెల 10 వ తేదీ విక్రవాండికి లోక్‌ల్ హాలిడే ప్రకటించనున్నామని, రెండు రోజులు టాస్మాక్ దుకాణాల మూతకు ఆదేశాలు ఇవ్వానున్నామన్నారు. తమకు ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
TN: ప్రధానికి ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నామని ప్రధాని మోదీ ఇటీవలి తమిళనాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీని, బీజేపీని ఇంటికి పంపించేదాకా తమ పార్టీ నిద్రపోదన్నారు. ‘డీఎంకే నేతలకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. అవును మేం నిన్ను, బీజేపీని ఇంటికి పంపించేదాకా నిద్రపోము. 2014లో గ్యాస్ సిలిండర్ రూ. 450, ఇప్పుడు రూ.1200. ఇటీవలే పీఎం దానిని రూ.100 తగ్గించి ఒక డ్రామా ఆడారు.ఎన్నికల తర్వాత గ్యాస్ ధరను తిరిగి రూ.500 పెంచుతాడు’అని ఉదయనిధి ఫైర్ అయ్యారు. కాగా, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తొలి దశలోనే ఏప్రిల్ 19న జరగనుంది. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇదీ చదవండి.. రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
సాక్షి కార్టూన్ 14-03-2021
-
TN Assembly polls : స్టార్ హీరో అరంగేట్రం
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం(డీఎంకే) తన రేసుగుర్రాలను ప్రకటించింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలు- 2021 కు మొత్తం 173 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. అదే విధంగా స్టాలిన్ తనయుడు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంనుంచి అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించడం విశేషం. డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంపై తంగ తమిళసెల్వన్ పోటీ చేస్తారని, సీఎం ఇ పళనిస్వామితో టీ సంపత్‌కుమార్ తలపడ నున్నారని డీఏంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దురై మురుగన్, కె ఎన్ నెహ్రూ, కె పొన్ముడి, ఎంఆర్‌కె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్లతోపాటు మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్ రాజన్, కన్నప్పన్, మాజీ స్పీకర్ అవుడియ్యప్పన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే డీఎంకే ఐటీ వింగ్ చీఫ్ పీటీఆర్ తియాగరాజన్, టీఆర్ బాలు కుమార్ టీఆర్బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లను ఇప్పటికే కూటమి కేటాయించగా, మిగిలిన 173 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. హీరోగా, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌తో చిత్ర నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. -
వారసులొచ్చారు..
సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్ స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది. -
నయనతార షూటింగ్‌కు బ్రేక్
ఉదయనిధి, నయనతార జంటగా నటిస్తున్న నన్బేండా చిత్రం షూటింగ్‌కు బ్రేక్ పడింది. తంజావూరు మణిమండపం సమీంలోని ఆంగ్లేయుల పాలనా కాలంలో నిర్మించిన చెరసాల ఉంది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ అనాథ శరణాలయంగా నియోగించుకుంటున్నారు. ఇక్కడ నన్బేండా చిత్రం షూటింగ్ నిర్వహించాలని భావించిన చిత్ర యూనిట్ అందుకు సన్నాహాలు చేసుకుంది. చిత్ర యూనిట్ షూటింగ్‌కు సిద్ధమయ్యూరు. ఆ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి పొందలేదన్న విషయం తెలియడంతో అక్కడి నిర్వాహకులు అనుమతి లేకుండా చిత్రీకరించరాదంటూ అడ్డుకోవడంతో పాటు చిత్ర యూనిట్‌ను అక్కడ నుంచి తరిమేశారు. దీంతో చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ప్రభుత్వ అనాథ శరణాలయంలో షూటింగ్ తీయూలంటే, చెన్నైలోని ప్రజా సంక్షేమ శాఖ అధికారి అనుమతి పొందాల్సి ఉంటుం ది. అయితే చిత్ర యూనిట్ అనుమతి కోరుతూ అధికారికి లేఖ రాశారు. దాని నఖలును ఆ శాఖ కార్యాలయం చిత్ర యూనిట్‌కు ఇచ్చింది. ఆ నఖలు పత్రాన్ని అనాథ శరణాలయం నిర్వాహకులకు చూపి షూటింగ్ నిర్వహించాలని ప్రయత్నించింది. దీంతో అధికారులు నన్బేండా చిత్ర షూటింగ్‌ను అడ్డుకున్నట్లు తెలిసింది.