
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు.
డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు