
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment