Samaritans
-
సూపర్ హీరోకి కరోనా ఎఫెక్ట్
కరోనా దెబ్బకు సూపర్ హీరో కాస్తా వెనక్కి తగ్గాడు. రెండు వారాల పాటు తన యూనిట్‌ని ఇంటిపట్టున ఉంచాలనుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ ‘సమారిటన్’. ఈ చిత్రం షూటింగ్ గత వారం జార్జియాలో జరిగింది. అయితే కోవిడ్ 19 ఎఫెక్ట్‌కి ఈ సూపర్ హీరో చిత్రం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. రెండు వారాల తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇందులో సిల్వెస్టర్ స్టాలోన్ పారిశుధ్య కార్మికుడి పాత్ర చేస్తున్నారు. ఆయన ఓ నిర్మాత కూడా. ఓవర్లార్డ్ జూలియస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నాన్నను చూడకు..పాకుతూ రా..
న్యూయార్క్ నగరంలో అనూహ్య ప్రమాదంలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటన కొంత సంతోషాన్నివ్వగా, మరింత విషాదాన్ని నింపింది. అవును.. విషాదం ఎందుకంటే ఫెర్నాండో బాల్బునా (45) అనే వ్యక్తి తన పాప (5)తో సహా రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే ఫెర్నాండో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పాప ప్రాణాలతో బైటపడింది. సోమవారం ఉదయం బ్రోంక్స్ లోని కింగ్స్బ్రిడ్జ్ రోడ్ స్టేషన్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షలు కథనం ప్రకారం పాపను ఎత్తుకున్న ఒకవ్యక్తి పాపతో సహా రైలు పట్టాలపై దూకేశాడు. దీంతో ఇద్దరు సహ ప్రయాణికులు వారి రక్షించేందుకు ట్రాక్‌లపైకి వెళ్లారు. కానీ అప్పటికే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, అదృష్టవశాత్తూ పాప బైటపడింది. అయితే పట్టాలపై ఇరుక్కున్న పాపకు జైరో టోర్రెస్ ధైర్యం చెప్పి కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది. ‘నాన్నకు ఏమైంది.. అంటూ బెదిరిపోతున్న పాపను ఊరడించిన జైరో.. నాన్నవైపు చూడకు..నన్నుచూడు..నాదగ్గరకు రా..పప్పీలా పాకుతూ నావైపు రా అంటూ ఆమెను పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంకి తీసుకొచ్చాడు. ఈ ఘనటపై మృతుని భార్య, పాప తల్లి తన పాపను రక్షించింనందుకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే ఫెర్నాండో సబ్వే ట్రాక్‌పైకి దూసుకెళ్లినట్లు సాక్షులు చెప్పారనీ, సంఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆత్మహత్యల నివారణకు ఫేస్బుక్ మరో అడుగు
లండన్ : నిరుత్సాహంతో, నైరాశ్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణపై దృష్టిసారించిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, చారిటీ సంస్థ సామరిటన్స్ తో జతకట్టింది. సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక టూల్స్‌ను ఆవిష్కరించిన ఫేస్బుక్, చారిటీ సంస్థతో చేతులు కలిపి ఈ విషయంపై మరింత పోరాటం చేయదలిచింది. సూసైడల్ ఎమోషన్స్‌తో స్నేహితులు, యూజర్ల ఫ్లాగ్ పోస్టుపై చేసే పోస్టులపై ఆధారపడి ఫేస్బుక్ ఈ ఆత్మహత్యల నివారణకు దోహదం చేయనుంది. హెల్ప్ ఆప్షన్ బటన్‌తో ఫేస్బుక్ మోడరేటర్లను ఆశ్రయించినవారిని గుర్తించి, వారికి సామరిటన్స్ తో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించనుంది. సామరిటన్స్ వాలటరీలను ఎలా కలవాలో కూడా టూల్స్ సహకరించకేందుకు ఓ ఆప్షన్‌ను ఫేస్బుక్ నిర్వర్తిస్తోంది. స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా ఫేస్‌బుక్‌ను ప్రజలు వాడుతున్నారని, దీని ద్వారా ఒత్తిడికి గురవుతున్న యూజర్లను గుర్తించి, ఆ భారం నుంచి తప్పించడానికి ఫేస్బుక్ కృషిచేస్తున్నట్టు కంపెనీ యూరోపియన్ సేఫ్టీ పాలసీ మేనేజర్ జూలీ డి బేలియన్కోర్టు తెలిపారు. సర్వే ఆధారిత సామరిటన్స్ నిరాశతో ఆత్మహత్యకు ప్రేరేపితులవుతున్న వారికి మద్దతుగా నిలిచి, ఎమోషనల్‌గా సపోర్టు కల్పించడానికి కృషిచేస్తోంది.