ఆత్మహత్యల నివారణకు ఫేస్బుక్ మరో అడుగు
ఆత్మహత్యల నివారణకు ఫేస్బుక్ మరో అడుగు
Published Tue, Sep 6 2016 11:11 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
లండన్ : నిరుత్సాహంతో, నైరాశ్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణపై దృష్టిసారించిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, చారిటీ సంస్థ సామరిటన్స్ తో జతకట్టింది. సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక టూల్స్ను ఆవిష్కరించిన ఫేస్బుక్, చారిటీ సంస్థతో చేతులు కలిపి ఈ విషయంపై మరింత పోరాటం చేయదలిచింది. సూసైడల్ ఎమోషన్స్తో స్నేహితులు, యూజర్ల ఫ్లాగ్ పోస్టుపై చేసే పోస్టులపై ఆధారపడి ఫేస్బుక్ ఈ ఆత్మహత్యల నివారణకు దోహదం చేయనుంది.
హెల్ప్ ఆప్షన్ బటన్తో ఫేస్బుక్ మోడరేటర్లను ఆశ్రయించినవారిని గుర్తించి, వారికి సామరిటన్స్ తో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించనుంది. సామరిటన్స్ వాలటరీలను ఎలా కలవాలో కూడా టూల్స్ సహకరించకేందుకు ఓ ఆప్షన్ను ఫేస్బుక్ నిర్వర్తిస్తోంది. స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా ఫేస్బుక్ను ప్రజలు వాడుతున్నారని, దీని ద్వారా ఒత్తిడికి గురవుతున్న యూజర్లను గుర్తించి, ఆ భారం నుంచి తప్పించడానికి ఫేస్బుక్ కృషిచేస్తున్నట్టు కంపెనీ యూరోపియన్ సేఫ్టీ పాలసీ మేనేజర్ జూలీ డి బేలియన్కోర్టు తెలిపారు. సర్వే ఆధారిత సామరిటన్స్ నిరాశతో ఆత్మహత్యకు ప్రేరేపితులవుతున్న వారికి మద్దతుగా నిలిచి, ఎమోషనల్గా సపోర్టు కల్పించడానికి కృషిచేస్తోంది.
Advertisement
Advertisement