బతికే ఉన్నానని సూపర్ స్టార్ చెప్పినా..
తాను ఇంకా బతికే ఉన్ననని, తనపై అలాంటి వదంతులు ప్రచారం చేయొద్దని ఓ హీరో సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తిచేశాడు. అతడు మరెవరో కాదు హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్. గతవారం ఆయన చనిపోయాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'రాంబో'. ఆ సిరీస్ లో స్టాలోన్ తీసిన సినిమాలు చూసి ఎంతో మంది ఆయన అభిమానులుగా మారిపోయారన్న విషయం తెలిసిందే. ఎవరో ఆకతాయి రాంబో చనిపోయాడని గత వారం ప్రచారం చేశాడు.
రాంబో చనిపోయాడంటూ భిన్న కథనాలు రావడంతో తన కూతురు సోఫియా స్టాలోన్ తో కలిసి డిన్నర్ చేసిన సందర్భంగా దిగిన ఫొటోను మూడు రోజుల కిందట పోస్ట్ చేశాడు. అయినా ఆయనపై దుష్ప్రచారం ఆగలేదు. తాజాగా మరోసారి రాంబో చనిపోయాడని కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్టాలోన్ చనిపోయాడని చెప్పగానే మా అమ్మ ఏడుపు స్టార్ట్ చేసిందని సారా హైలిన్ అనే యువతి ట్వీట్ చేసింది. ఆయన చనిపోయాడన్న వార్త నిజం కాదని లార్డ్ కమెట్ ట్వీట్ చేయగా, ఇలాంటి వార్తలను ప్రచారం చేయోద్దని మరో ట్విట్టర్ యూజర్ కార్నర్ మండిపడ్డాడు.
Well sir I must admit I wasn't expecting to see "started the Slyvester Stallone online death hoax" as a point on your resume but here we are
— Connor (@Conbard) 6 September 2016
i told my mom sylvester stallone died and she actually started crying and now i feel bad
— sar (@sarahhyellin) 6 September 2016
Ok people I read someone said Stallone died....Pfft he isn't dead his career is.
— Lord Comet (@LordComet) 6 September 2016