ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..! | Katy Perry Twitter account hacked and nasty and vulgar tweets posted | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..!

Published Tue, May 31 2016 2:45 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..! - Sakshi

ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..!

లాస్ ఎంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ట్విట్టర్ ఖాతాలో 89 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విట్టర్ హ్యాక్ చేసి అసభ్యకరమైన ట్వీట్స్ పోస్ట్ చేశారు. పెర్రీ టైమ్ లైన్లో కనిపించేలా వల్గర్ విషయాలకు సంబంధించిన చాలా ట్వీట్స్ పోస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ వివరాలను బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఆమె ట్విట్టర్ హ్యాక్ చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఫేమస్ సింగర్ ట్విట్టర్ ఇలా హ్యాక్ కావడం, అసభ్య పదజాలం వాడుతూ పోస్ట్ లు చేయడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

సింగర్ టేలర్ స్విఫ్ట్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. 'మిస్ యూ బేబీ' అని కామెంట్ చేస్తూ ఆ పోస్ట్ ను టేలర్ స్విఫ్ట్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అంతటితో ఆగకుండా యూట్యూట్ సంచలనం కిమ్ స్టర్ పై అసభ్య పదజాలంతో కూడిన కామెంట్లు పెర్రీ ట్వీట్టర్లో పోస్ట్ కావడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈ విషయం ఆమె త్వరగానే కనిపెట్టి సమస్య నుంచి బయటపడింది. 'డార్క్ హౌస్' సింగర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్ కేటి పెర్రీ అకౌంట్ ను త్వరగానే రెక్టిఫై చేసి అసభ్య కామెంట్లను డిలీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement