katy perry
-
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : బాలీవుడ్ తారల సందడి, వీడియో వైరల్
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ స్పెషల్ క్యూయిజ్ పాప్-రాక్ స్టార్ కేటీ పెర్రీ అదర గొట్టేసింది. అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సారా అలీఖాన్ తన 'రోమన్ హాలిడే'ని ఆస్వాదిస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే త్వరలో తండ్రి కాబోతున్న రణ్వీర్ సింగ్ కూడా స్టేజ్‌పై స్టెప్పులతో అలరించాడు. క్రూయిజ్‌లో అతిథులతో సెల్ఫీకి పోజులిచ్చాడు. అలాగే ఓర్రీ అమాంతం ఎత్తివేసిన దృశ్యాలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.Radhika-Anant's 2nd pre wedding bash: Backstreet Boys perform 'I Wanna Be With You' at cruise party.#AmbaniWedding @backstreetboys Read more: https://t.co/fUFPEByuB0 pic.twitter.com/og7wMLZj6k— editorji (@editorji) May 30, 2024'లా వీటా ఇ అన్ వియాజియో' అనే థీమ్‌తో ఇచ్చిన లైవ్ ఈవెంట్ అతిథులను మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే కొలంబియన్ సింగర్ షకీరా అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ప్రత్యేకంగా పెర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం.'స్టార్రీ నైట్స్' క్రూయిజ్ వేడుకలో లెజెండరీ బాయ్ బ్యాండ్ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ప్రదర్శనతో ఈవెంట్ షురూ అయింది. వారి ట్రేడ్‌మార్క్ ఆల్-వైట్ దుస్తులను ధరించి, పాపులర్ ట్రాక్స్‌తో ఆహూతులను అలరించారు. ఇదే పార్టీలో అంబానీ, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్-శ్లోకా మెహతా ముద్దుల తనయ వేదా తొలి బర్త్‌డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. కాగా అనంత్-రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబైలోని BKCలోని జియో వరల్డ్ సెంటర్లో సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా నిలిచింది.ముఖేష నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్‌లో పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్ ఈవెంట్లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్‌తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్‌లోని ప్రతి సూట్ స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్ ఈవెంట్లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. -
అలా వైకుంఠపురంలోకి.. కేటి దంపతులు
కాలిఫోర్నియా: కేటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్ దంపతులు ఇటీవల కాలిఫోర్నియాలోని మాంటెసిటీలో అత్యంత ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. కుబేరులు నివసించే ప్రాంతంలోనే వారో భవనాన్ని 14.2 మిలియన్ డాలర్లకు (దాదాపు 105 కోట్ల రూపాయలు) కొనుగోలు చేశారు. చుట్టూ పచ్చని కొండలు, లోయలు ఓ పక్కన సముద్ర తీరం మరో పక్కన కనిపించేంత దూరంలో సుందర వనం, స్విమ్మింగ్ కలిగిన విలాసవంతమైన భవనాన్ని డ్యూరాసెల్ మాజీ సీఈవో సీ. రాబర్ట్ కిడ్డర్ నుంచి కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కిడ్డర్ 20 ఏళ్ల పాటు ఆ భవనంలో ఉన్నారు. ప్రిన్స్ హారి, మేఘన్ మార్కెలే కొనుగోసిన విలాస భవనానికి సమీపంలోనే పెర్రీ దంపతులు ఈ భవనాన్ని కొనుగోలు చేయడం విశేషం. అమెరికా పాప్ సింగర్‌గా, గేయ రచయితగా ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకొంటున్న కేటి పెర్రీ, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సీరియల్ చిత్రాల ద్వారా హాలివుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓర్లాండో బ్లూమ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. గత ఆగస్టు నెలలోనే వారికి జన్మించిన పాపకు వారు డైజీ డోవ్ అని పేరు పెట్టారు. రెండు పడక గదులు, రెండు బాత్ రూమ్‌లు కిచెన్, డైనింగ్, లైబ్రరీ, సిట్టింగ్ హాళ్లతో పాటు ఇంటి చుట్టూ విస్తరించిన ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని సేదతీరేందుకు ఎన్నో సిట్ అవుట్లు ఉన్నాయి. నౌకర్లు, చాకర్లను పక్కన పెడితే ఆ విలాస భవనంలో వారండేది ముగ్గురే. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న జాన్సేన) -
ఇది నిజం ఫొటో కాదు
హాలీవుడ్ పాప్ సింగర్ క్యాటీ పెర్రీ ఇండియా టూర్‌కు విచ్చేసింది. అందులో భాగంగా శనివారం ముంబైలో జరిగిన లైవ్ కాన్సెర్ట్(సంగీత కచేరీ)కు ఆమె హాజరైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే హాజరయ్యారు. 2012లో ఐపీఎల్ ప్రారంభోత్సవానికిగానూ అమెరికన్ స్టార్ క్యాటీ పెర్రీ ముంబైలో ప్రదర్శన ఇచ్చింది. అనంతరం ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ముంబైలో అడుగు పెట్టింది. ఆమె కోసం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సెలబ్రిటీలకు గురువారం విందు ఏర్పాటు చేశాడు. ఐశ్వర్యారాయ్, కాజోల్, గౌరీ ఖాన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, అనుష్క శర్మ, కైరా అద్వానీ, సోనాక్షి సిన్హా, మలైకా, అమృత అరోరా, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, నేహా ధూపియా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు క్యాటీ పెర్రీతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో విజయ్ దేవరకొండ కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ గ్రోవర్ మాత్రం పార్టీకి వెళ్లలేకపోయాడు. కానీ అతను మాత్రం క్యాటీ పెర్రీను కలిసానంటున్నాడు. ఫొటోషాప్ సాయంతో క్యాటీ పెర్రీతో సునీల్ కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘నేను కూడా క్యాటీ పెర్రీతో ఉన్నాను..’ అంటూ కామెంట్ జోడించి హాస్యాన్ని చాటుకున్నాడు. ఇక కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో సునీల్ గ్రోవర్ మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు టీవీషోల్లోనూ మెరిసాడు. భారత్ చిత్రంలో సల్మాన్‌ఖాన్ స్నేహితుడిగా నటుడిగా మెప్పించాడు. View this post on Instagram Like everyone else I am also with @katyperry . She is very colourful and humble. A post shared by Sunil Grover (@whosunilgrover) on Nov 15, 2019 at 1:26am PST -
ముద్దు గొడవ!
‘‘నువ్వెప్పుడైనా, ఎవరినైనా కిస్ చేశావా?’’ అనడిగింది పాపులర్ సింగర్ కేటీ పెరీ, 20 ఏళ్ల బెంజమిన్ గ్లేజ్ని. అమెరికన్ ఐడల్ షోలో కంటెస్టెంట్ అతను. ఆమె జడ్జి. బెంజమిన్ లేదన్నాడు. అయితే నాకొక ముద్దివ్వు అనడిగింది కేటీ, అతను ఆమె చెంపమీద ఒక ముద్దు పెట్టాడు. ‘ఇలాగా?’ అంటూ అతను ఊహించని రీతిలో గ్లేజ్ పెదాల మీద ముద్దు పెట్టింది కేటీ. చిన్న కుర్రాడు. అందులోనూ అంతకుముందు ఎప్పుడూ కిస్ చెయ్యలేదు. కంగారు పడిపోయి, బాగా ఇబ్బంది పడ్డాడు. ఆ విషయమే తర్వాత అందరికీ చెప్పాడు. గొడవ అప్పుడు మొదలైంది. కేటీ పేరీ చేసిన పని ఏ రకంగా చూసినా అబ్యూజ్ కిందకే వస్తుందని అన్నారంతా. ‘ఇదే పని ఒక మేల్ జడ్జి చేస్తే ఏం చేసేవారు?’ అని గొడవ చేశారు. ముందు ఇద్దరిద్దరే కామెంట్ చేశారు. ఆ తర్వాత ఈ ముద్దు గొడవ పెద్దదైపోయింది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ ముద్దు గొడవే! ఇదింకా పెద్దదవుతుందనుకున్నాడో ఏమో, గ్లేజ్ బయటకొచ్చి చెప్పాడు.. ‘‘నేను ఇబ్బందిగా ఫీలియిన మాట వాస్తవమే. నా ఫస్ట్ కిస్ నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండాలనుకున్నా. కేటీ పెరీ స్ట్రేంజర్. ఆమె అలా కిస్ చేస్తే ఇబ్బందనిపించింది. అంతేకానీ అదేమీ అబ్యూజ్ కాదు. హరాస్మెంట్ అంతకన్నా కాదు’’. మొత్తానికి గ్లేజ్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌తో గొడవైతే మొత్తం సద్దుమణిగిపోయింది. కానీ ముద్దు ఇంకా ఆన్లైన్లో సెన్సేషనే! -
జస్టిన్ బీబర్ కొత్త రికార్డు
న్యూయార్క్ : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆదివారం సరికొత్త రికార్డు నమోదు చేశారు. సంగీత ప్రియులను తన గాత్రంతో అలరించే బీబర్.. తాజాగా ట్విటర్లో 100 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నారు. ట్విటర్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బీబర్ నిలిచారు. బీబర్ కంటే ముందుగా క్యాటీ పెర్రీ ఈ అంకెను చేరుకున్నారు. వీరి తరువాత స్థానంలో టేలర్ స్విఫ్ట్ 85.5, రిహానా 76.9, లేడీగాగ 69.9 మిలియన్ పాలోవర్లతో ఉన్నారు. తన ట్విటర్ అకౌంట్‌కు 100 మిలియన్ ఫాలోవర్లు రావడంపై బీబర్ ఆనందం వ్యక్తం చేశారు. బీబర్ సాధించిన ఘనతను ట్విటర్ కూడా #100Mbeliebers emoji పేరుతో సెలబ్రేట్ చేసింది. -
కాళికాదేవీలా ఉన్నానంటూ పోస్టు, వివాదం
పాప్‌స్టార్ కేటీ పెర్రీ వివాదంలో ఇరుక్కుంది. హిందూవుల ఆరాధ్య దైవమైన కాళికాదేవీ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది కేటీ. ఆ తర్వాత వెంటనే తన మూడ్ ఇలా ఉందంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఫోటో షేర్ చేసిన వెంటనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. భారీ సంఖ్యలో షేర్లు కూడా రావడంతో కేటీ పోస్టు ఆన్లైన్లో వైరల్ అయింది. అయితే, కొందరూ భారత నెటిజన్లు కాళికాదేవి హిందువుల దైవమని, ఆమెను చాలా మంది అమ్మగా భావిస్తారని కామెంట్ చేశారు. అలాంటి కాళికామాతను కేటీ తన మూడ్‌తో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందువుల సంస్కృతిని అవమానించేలా కేటీ పోస్టు ఉందంటూ విమర్శలు చేశారు. అయితే మరికొందరు మాత్రం కేటీకి హిందువుల దేవుళ్ల గురించి తెలిసినందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్లు చేశారు. కాగా.. మరికొందరు నెటిజన్లు కేటీకి మద్దతుగా నిలిచారు. ఆమె కేవలం పోస్టు చేసిందని, అందులో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. కేటీ పోస్టును తప్పుదోవ పట్టించొద్దని నెటిజన్లను కోరారు. -
ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..!
లాస్ ఎంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ట్విట్టర్ ఖాతాలో 89 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విట్టర్ హ్యాక్ చేసి అసభ్యకరమైన ట్వీట్స్ పోస్ట్ చేశారు. పెర్రీ టైమ్ లైన్లో కనిపించేలా వల్గర్ విషయాలకు సంబంధించిన చాలా ట్వీట్స్ పోస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ వివరాలను బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఆమె ట్విట్టర్ హ్యాక్ చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఫేమస్ సింగర్ ట్విట్టర్ ఇలా హ్యాక్ కావడం, అసభ్య పదజాలం వాడుతూ పోస్ట్ లు చేయడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సింగర్ టేలర్ స్విఫ్ట్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. 'మిస్ యూ బేబీ' అని కామెంట్ చేస్తూ ఆ పోస్ట్ ను టేలర్ స్విఫ్ట్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అంతటితో ఆగకుండా యూట్యూట్ సంచలనం కిమ్ స్టర్ పై అసభ్య పదజాలంతో కూడిన కామెంట్లు పెర్రీ ట్వీట్టర్లో పోస్ట్ కావడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈ విషయం ఆమె త్వరగానే కనిపెట్టి సమస్య నుంచి బయటపడింది. 'డార్క్ హౌస్' సింగర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్ కేటి పెర్రీ అకౌంట్ ను త్వరగానే రెక్టిఫై చేసి అసభ్య కామెంట్లను డిలీట్ చేశారు. -
'అందాన్ని మరింత అందంగా చూపించావ్'
లాస్ ఏంజిల్స్: ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రి తన మిత్రుని మృతికి నివాళి తెలుపుతూ ఉద్వేగపూరితమైన లేఖ రాసింది. కేటీ పెర్రీ మిత్రుడు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ జేక్ బెయిలీ(37) శుక్రవారం మృతి చెందాడు. బెయిలీతో కలిసి కేటీ పెర్రీ రూపొందించిన 'రోర్' గీతం విశేష ఆదరణను పొందింది. బెయిలీకి నివాళిగా కేటీ పెర్రీ రాసిన లేఖలో.. సున్నితమైన మనసున్న బెయిలీ.. మనం కలిసి చేసిన ప్రయాణం, స్నేహం చాలా అద్భతమైంది. మనిద్దరం కలిసి చక్కని గీతాలను రూపొందించాం. ప్రపంచంలోని గొప్ప వేదికలను మనం కలిసి జయించాం. నీవు జీవితం విశిష్టమైనదని గుర్తించి దానికి అనుగుణంగా జీవించావు. నీలో ఉన్నటువంటి కళతో అందాన్ని మరింత అందంగా చూపించావు అంటూ బెయిలీని గుర్తుచేసుకుంది. బెయిలీ శాశ్వత శాంతిలోకి చేరుకున్నాడు. మిత్రుని మృతి కలచివేసిందని అయినా, ఈ భూమిపై ఎప్పటికీ సంతోషంగా ఉండడం కష్టమని తెలుసన్న పెర్రీ.. బెయిలీ కుటుంబానికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ముగించింది. -
ఆమె మాజీ భర్తతో మాట్లాడదట
లాస్ ఎంజిల్స్: తన మాజీ భర్తతో మాట్లాడాలని తనకు లేదని ప్రముఖ పాప్ గాయని కేటి పెర్రీ అన్నారు. మూడేళ్లుగా భర్త రస్సెల్ బ్రాండ్‌తో విడిపోయి ఉంటున్న ఆమెను ఓ మీడియా ప్రశ్నించగా కాస్త అసహనంగా మాట్లాడింది. తాను ఇప్పుడు మీ నుంచి ఎలాంటి వినాలనుకోవడం లేదని, ఏదైనా వినాలకున్నా.. నేర్చుకోవాలనుకున్నా అది మ్యూజిక్ ద్వారానే చేస్తానని చెప్పింది. తనకు ఏం కావాలో తన పాటలే చెప్తాయని బదులిచ్చారు. 'నేను విడాకుల దరఖాస్తు పూర్తి చేస్తున్నాను అని ఆయన(రస్సెల్ బ్రాండ్) మెస్సేజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతడు కూడా నాతో మాట్లాడలేదు. ఏదేమైన ఒక మహిళకు ప్రేమ ఎంత ముఖ్యమో విజయం అంతముఖ్యం అని అవి రెండు ఖచ్చితంగా కావాల్సిందే' అని చెప్పారు.