అనంత్‌-రాధిక క్రూయిజ్‌ పార్టీ : బాలీవుడ్‌ తారల సందడి, వీడి​యో వైరల్‌ | Backstreet Boys, Katy Perry, Sara, Ranveer Performs At Anant-Radhika Cruise Party | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక క్రూయిజ్‌ పార్టీ : బాలీవుడ్‌ తారల సందడి, వీడి​యో వైరల్‌

Published Sat, Jun 1 2024 1:38 PM | Last Updated on Sat, Jun 1 2024 3:26 PM

Backstreet Boys, Katy Perry, Sara, Ranveer Performs At Anant-Radhika Cruise Party

 కేటీ పెర్రీకి రూ.45 కోట్లు  రెమ్యునరేషన్‌

 క్రూయిజ్‌ పార్టీలో, రణ్‌వీర్‌సింగ్‌, కపూర్‌ సిస్టర్స్‌  సారా అలీఖాన్‌ సందడి

 బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ఫెర్‌ఫామెన్స్‌

బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత  ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో  ప్రీ వెడ్డింగ్‌ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ స్పెషల్‌  క్యూయిజ్ పాప్-రాక్ స్టార్‌ కేటీ పెర్రీ అదర గొట్టేసింది. అలాగే బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సందడి చేశాడు.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సారా అలీఖాన్ తన 'రోమన్ హాలిడే'ని ఆస్వాదిస్తూ స్నేహితులతో  ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌ చేసింది.  అలాగే త్వరలో తండ్రి కాబోతున్న రణ్‌వీర్‌ సింగ్‌ కూడా స్టేజ్‌పై  స్టెప్పులతో అలరించాడు. క్రూయిజ్‌లో అతిథులతో సెల్ఫీకి పోజులిచ్చాడు. 

అలాగే  ఓర్రీ అమాంతం ఎత్తివేసిన దృశ్యాలు నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తున్నాయి.

'లా వీటా ఇ అన్ వియాజియో' అనే థీమ్‌తో  ఇచ్చిన లైవ్‌ ఈవెంట్‌ అతిథులను మెస్మరైజ్‌ చేసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు వసూలు  చేసింది.  అలాగే కొలంబియన్ సింగర్ షకీరా అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ప్రత్యేకంగా పెర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం.

'స్టార్రీ నైట్స్' క్రూయిజ్  వేడుకలో లెజెండరీ బాయ్ బ్యాండ్ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ప్రదర్శనతో ఈవెంట్‌ షురూ అయింది. వారి ట్రేడ్‌మార్క్ ఆల్-వైట్ దుస్తులను ధరించి, పాపులర్‌  ట్రాక్స్‌తో ఆహూతులను అలరించారు.  ఇదే పార్టీలో  అంబానీ, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్‌-శ్లోకా మెహతా ముద్దుల తనయ వేదా తొలి బర్త్‌డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.  

కాగా అనంత్‌-రాధిక మర్చంట్‌   జూలై 12న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబైలోని BKCలోని జియో వరల్డ్ సెంటర్‌లో  సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement