అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్‌ ఖర్చు ఎంతో తెలుసా? | Anant Ambani-Radhika's Cruise Pre-Wedding: Katy Perry Performs | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్‌ ఖర్చు ఎంతో తెలుసా?

Published Fri, May 31 2024 12:14 PM | Last Updated on Fri, May 31 2024 2:47 PM

Anant Ambani-Radhika's Cruise Pre-Wedding: Katy Perry Performs

 పాప్‌ ఐకాన్‌ కేరీ పెర్రీ ‍ షో,  భారీ మొత్తంలో ఫీజు

 రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఖర్చు  సుమారు రూ. 7500 కోట్లు!

 

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు షురూ అయ్యాయి.  దీంతో  రోజుకొక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

ముఖేష​ నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది.  దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుక జరుగుతోంది.  జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక  మూడు రోజుల  ప్రీ-వెడ్డింగ్‌లో పాపులర్‌ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ  ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్‌ ఈవెంట్‌లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్‌తో ఈ గాలా సాగుతుంది.  ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. 

ఖర్చు  రూ. 7500కోట్లు
రూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది.  అంతేకాదు  క్రూయిజ్‌లోని ప్రతి సూట్‌ స్పా, జిమ్‌, స్విమ్మింగ్ పూల్‌ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది.   ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్‌ ఈవెంట్‌లో డీజేలు, బాణా సంచా వెలుగులతో  మోత మోగనుంది.

కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement