
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది.
గుజరాత్‌లోని జాం నగర్‌లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రిల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులోని కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది.

అటు అనంత్ అద్భుతమైన లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్ నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు.

ఇదే ఈవెంట్‌లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడు లక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26 లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో రూ.7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్‌బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment