ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, సంపన్న పారిశ్రామికవేత్త రాధికా మర్చంట్‌ల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక సముద్రంపై విలాసవంతమైన క్రూయిజ్‌లో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.
ఇటలీలోని పాలెర్మో నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్‌లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రోమ్, పోర్టోఫినో, జెనోవా, కేన్స్ లలో ఈ నౌకకు ప్రత్యేకంగా స్టాప్‌లు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.
అయితే ఈ వేడుక పోర్టోఫినోలోని వ్యాపారులు, స్థానిక ప్రజలకు కోపం తెప్పించింది. అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్థానిక బేను తీసుకుని స్థానికులకు, సందర్శకులకు అందుబాటులో లేకుండా చేయడమే ఇందుకు కారణం. ఇంతకు ముందెన్నడూ ఒక కార్యక్రమం కోసం ఇలా మొత్తం బేను మూసివేయలేదు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీల వివాహ వేడుకలు జరిగాయి. ఆస్ట్రేలియన్ సంగీతకారిణి సియా, రియాలిటీ టీవీ స్టార్ కోర్ట్నీ కర్దాషియాన్ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది.
మరో వైపు అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో పలు రకాల వంటకాల కోసం స్థానిక ప్రసిద్ధ రెస్టారెంట్‌లకు ఆర్డర్లు ఇచ్చారు. తమను లోబ్‌స్టర్ శాండ్‌విచ్‌లు తయారు చేయమని అడిగారిని, కానీ వేడుకలకు 20 రోజుల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని స్టీవెన్ స్పీల్బర్గ్, సర్ ఎల్టన్ జాన్, డెంజెల్ వాషింగ్టన్ మరియు సిల్వియో బెర్లుస్కోనీ వంటివారికి సేవలందించిన ప్రసిద్ధ రెస్టారెంట్ ఇల్ పునీ మేనేజర్ ఆండ్రియా మిరోలి తెలిపారు. ఈ చర్య అవమానకరంగా, అనుచితంగా ఉందని ఆయన వెల్లడించారు.
ఇక సోషల్ మీడియాలో స్థానికులు, సందర్శకులు పలు పోర్టోఫినో ప్రదేశాలు తమకు అందుబాటులో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. "చాలా మంది ఇతర సెలబ్రిటీలు, బిలియనీర్లు పోర్టోఫినోలో సంబరాలు చేసుకున్నారు, వారిలో ఎవరూ ఇతరులకు ప్రధాన పాయింట్‌కు యాక్సెస్ లేకుండా చేయలేదు" అని ఎక్స్ యూజర్లలో ఒకరు రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment