అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్‌ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా? | Anant Ambani Radhika Cruise prewedding Bash crores Queen Vibes looks | Sakshi
Sakshi News home page

అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్‌ విలువ రూ. 1002 కోట్లు! నమ్ముతారా?

Published Fri, Jun 21 2024 6:18 PM | Last Updated on Fri, Jun 21 2024 10:03 PM

Anant Ambani Radhika Cruise prewedding Bash crores Queen Vibes looks

అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్  ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్స్‌  ఫ్యాన్స్‌ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్‌  వ్యాపార  వారసుడు అనంత్‌ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్‌ స్టయిల్‌తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది.  

తాజాగా అనంత్‌- రాధిక ఇటలీ - ఫ్రాన్స్‌ లగ్జరీ క్రూయిజ్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ  వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్‌ చేసింది.  వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి  ప్రీ వెడ్డింగ్‌  వేడుక ఘనంగా జరిగాయి.  తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం),  ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో ప్రతీ ఈవెంట్‌, దుస్తులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్‌ పేజీ  అందించిన  డ్రెస్‌ ధలు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి.

వైట్‌ డ్రెస్‌ మహారాణిలా,  ధర రూ.1002 కోట్లు
రాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్‌, డైమండ్ ఆభరణాలతోరాయల్‌లుక్‌లో అందంగా మెరిసి పోయింది.  స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్‌కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్‌తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్‌ ధర రూ. 1002కోట్లు

క్రూయిజ్ బాష్‌లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్‌కఫ్‌లు, లావెండర్ డ్రెస్‌, మొత్తం లుక్‌ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు  చేసిన డ్రెస్‌, బంగారు ఆభరణాలతో  డైమండ్‌ నగలు,  బ్యాంగిల్స్ , వాచ్‌తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.

అనంత్‌ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్‌ ధర
అనంత్‌ తన ప్రేమంతా కురిపించిన లవ్‌లెటర్‌తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది.  లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్‌ ఖర్చు రూ. 478 కోట్లు.

పాతకాలపు డియోర్ డ్రెస్‌లో ఖరీదైన యాక్సెసరీస్‌తో  రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్‌ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్‌మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement