కాళికాదేవీలా ఉన్నానంటూ పోస్టు, వివాదం | Singer Katy Perry Posts Pic Of Goddess Kali, Gets Trolled By Indians | Sakshi
Sakshi News home page

కాళికాదేవీలా ఉన్నానంటూ పోస్టు, వివాదం

Published Thu, Apr 20 2017 11:26 AM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

కాళికాదేవీలా ఉన్నానంటూ పోస్టు, వివాదం

కాళికాదేవీలా ఉన్నానంటూ పోస్టు, వివాదం

పాప్‌స్టార్‌ కేటీ పెర్రీ వివాదంలో ఇరుక్కుంది. హిందూవుల ఆరాధ్య దైవమైన కాళికాదేవీ ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది కేటీ. ఆ తర్వాత వెంటనే తన మూడ్‌ ఇలా ఉందంటూ కామెంట్‌ పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఫోటో షేర్‌ చేసిన వెంటనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. భారీ సంఖ్యలో షేర్లు కూడా రావడంతో కేటీ పోస్టు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. అయితే, కొందరూ భారత నెటిజన్లు కాళికాదేవి హిందువుల దైవమని, ఆమెను చాలా మంది అమ్మగా భావిస్తారని కామెంట్‌ చేశారు.

అలాంటి కాళికామాతను కేటీ తన మూడ్‌తో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందువుల సంస్కృతిని అవమానించేలా కేటీ పోస్టు ఉందంటూ విమర్శలు చేశారు. అయితే మరికొందరు మాత్రం కేటీకి హిందువుల దేవుళ్ల గురించి తెలిసినందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్లు చేశారు. కాగా.. మరికొందరు నెటిజన్లు కేటీకి మద్దతుగా నిలిచారు. ఆమె కేవలం పోస్టు చేసిందని, అందులో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. కేటీ పోస్టును తప్పుదోవ పట్టించొద్దని నెటిజన్లను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement