'అందాన్ని మరింత అందంగా చూపించావ్' | Katy Perry pens emotional tribute for friend Jake Bailey | Sakshi
Sakshi News home page

'అందాన్ని మరింత అందంగా చూపించావ్'

Published Sun, Oct 25 2015 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

Katy Perry pens emotional tribute for friend Jake Bailey

లాస్ ఏంజిల్స్: ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రి తన మిత్రుని మృతికి నివాళి తెలుపుతూ ఉద్వేగపూరితమైన లేఖ రాసింది. కేటీ పెర్రీ మిత్రుడు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ జేక్ బెయిలీ(37) శుక్రవారం మృతి చెందాడు. బెయిలీతో కలిసి కేటీ పెర్రీ రూపొందించిన 'రోర్' గీతం విశేష ఆదరణను పొందింది.

బెయిలీకి నివాళిగా కేటీ పెర్రీ రాసిన లేఖలో.. సున్నితమైన మనసున్న బెయిలీ.. మనం కలిసి చేసిన ప్రయాణం, స్నేహం చాలా అద్భతమైంది. మనిద్దరం కలిసి చక్కని గీతాలను రూపొందించాం. ప్రపంచంలోని గొప్ప వేదికలను మనం కలిసి జయించాం. నీవు జీవితం విశిష్టమైనదని గుర్తించి దానికి అనుగుణంగా జీవించావు. నీలో ఉన్నటువంటి కళతో అందాన్ని మరింత అందంగా చూపించావు అంటూ బెయిలీని గుర్తుచేసుకుంది.

బెయిలీ శాశ్వత శాంతిలోకి చేరుకున్నాడు. మిత్రుని మృతి కలచివేసిందని అయినా, ఈ భూమిపై ఎప్పటికీ సంతోషంగా ఉండడం కష్టమని తెలుసన్న పెర్రీ.. బెయిలీ కుటుంబానికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ముగించింది.    








 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement