జస్టిన్‌ బీబర్‌ కొత్త రికార్డు | Justin Bieber crosses 100 million followers | Sakshi
Sakshi News home page

జస్టిన్‌ బీబర్‌ కొత్త రికార్డు

Published Sun, Sep 3 2017 3:53 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

జస్టిన్‌ బీబర్‌ కొత్త రికార్డు

జస్టిన్‌ బీబర్‌ కొత్త రికార్డు

న్యూయార్క్‌ : పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ ఆదివారం సరికొత్త రికార్డు నమోదు చేశారు. సంగీత ప్రియులను తన గాత్రంతో అలరించే  బీబర్‌.. తాజాగా ట్విటర్‌లో 100 మిలియన్‌ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్నారు. ట్విటర్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బీబర్‌ నిలిచారు. బీబర్‌ కంటే ముందుగా క్యాటీ పెర్రీ ఈ అంకెను చేరుకున్నారు. వీరి తరువాత స్థానంలో టేలర్‌ స్విఫ్ట్‌ 85.5, రిహానా 76.9, లేడీగాగ 69.9 మిలియన్ పాలోవర్లతో ఉన్నారు. తన ట్విటర్‌ అకౌంట్‌కు 100 మిలియన్‌ ఫాలోవర్లు రావడంపై బీబర్‌ ఆనందం వ్యక్తం చేశారు. బీబర్‌ సాధించిన ఘనతను ట్విటర్‌ కూడా #100Mbeliebers emoji  పేరుతో సెలబ్రేట్‌ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement