
Justin Bieber Reveals He Suffer With Face Paralysis: కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జస్టిన్ పాటలంలే చెవి కొసుకునేవారు ఇండియాలో సైతం ఉన్నారు. చిన్న వయసులోనే బేబీ.. బేబీ అంటూ పాడి ఎంతో మంది సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నాడు. అంతగా తన గాత్రంతో ఆకట్టుకున్న జస్టీన్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను పాక్షిక పక్షవాతానికి గురైనట్టు ప్రకటించాడు. ఈ మేరకు జస్టీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు.
చదవండి: నయనతార దంపతులపై టీటీడీ ఫైర్, నోటీసులు జారీ
‘చాలా ముఖ్యమైనది దయచేసి చూడండి.. నా కోసం ప్రార్థించండి’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో జస్టీన్ తాను అరుదైన వ్యాధితో భాధపడుతున్నట్లు వెల్లడించాడు. ‘నేను రామ్ సే హంట్ సిండ్రోమ్ భారిన పడ్డాను. ఈ వ్యాధి వల్ల నా ముఖ భాగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ముఖం పక్షపాతానికి గురైంది. కదలికలు సరిగా లేవు. కుడి కన్ను ఆర్పలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. దీని శరీరం కూడా మెల్లిగా శక్తి లేకుండా పోతుంది. తనలో ఈ వ్యాధి లక్షణాలో కాస్తా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాను వరల్డ్ టూర్ క్యాన్సల్ చేసుకున్నానని చెప్పాడు. ‘టొరంటో, వాషింగ్టన్ డీసీ, ఇండియా టూర్ రద్దు చేసుకున్నాను. పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు చేయాలేను’ అని తెలిపాడు.
చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’
కాగా ఈ రామ్‌సే హంట్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. సాధారణంగా చెవి, నోటి భాగంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ముఖ భాగం పక్షవాతాని గురవుతుంది. ముఖ పక్షవాతం బారినపడినవారిలో ఒకవైపు ముఖ కదళికలు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం బీబర్ ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు వినికిడి లోపం కూడా రావొచ్చు. పిల్లలు, పెద్దల్లో చికెన్‌పాక్స్ వ్యాధికి కారణమయ్యే వైరసే ఈ రామ్‌సే హంట్ సిండ్రోమ్. ప్రతీ 1 లక్ష మందిలో ఐదు నుంచి 10 మంది మాత్రమే రామ్‌సే సిండ్రోమ్ బారినపడుతారు. ఈ సిండ్రోమ్ బారినపడితే.. చెవి వద్ద ఎర్రని దద్దురు ఏర్పడుతుంద న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది.