అమెరికా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే అతడి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. ఇక అతడి మ్యూజిక్ కన్‌సర్ట్ అంటే వేలల్లో, లక్షల్లో అభిమానులు హజరవుతారు. ఈ నేపథ్యంలో అమెరికాలో రీసెంట్‌గా నిర్వహించిన జస్టిన్ బీబర్ కన్‌సర్ట్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించిన రెస్టారెంట్ బయట కాల్పులు కలకలం సృష్టించింది. అక్కడి వచ్చిన పలువురి మధ్య ఘర్షణ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికి మీడియా సమాచారం.
చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్
ది నైస్ గై రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి లిజెత్ లోమెలి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఇద్దరు బాధితులను గుర్తించారని, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో రాపర్ కోడాక్ బ్లాక్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి ఎటువంటి సమాచారం లేదని, ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: Krithi Shetty: మాటిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ‘బేబమ్మ’
కానీ జస్టిన్ బీబర్ మ్యూజిక్ కన్‌సర్ట్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ఈ ఘటనపై పలు అనుమానులు కూడా తలెత్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. డ్రేక్, లియో డికాప్రియో, కెండల్ జెన్నర్, కోల్ కర్దాషియాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. సంగీత కచేరీ అనంతరం కొడాక్ బ్లాక్, గున్నా , లిల్ బేబీ బయటికి వచ్చారని, అప్పుడే గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం. కొందరు వ్యక్తులు కారుపైకి ఎక్కడంతో గొడవ మొదలైందని.. కొంతసేపటికి బుల్లెట్ల శబ్ధం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment