'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది' | Sylvester Stallone wife stopped him from joining politics | Sakshi
Sakshi News home page

'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది'

Published Mon, Jan 11 2016 11:47 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది' - Sakshi

'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది'

లండన్: హాలీవుడ్లో భారీ మాస్ ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్. 'రాంబో' సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ కండల వీరుడు తన మిత్రుడు ఆర్నాల్డ్ షార్గ్నెజ్జర్ దారిలో నడుస్తూ రాజకీయాల్లోకి రావాలని భావించాడు. ఆయనలాగే తాను కూడా అమెరికా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. అయితే చివరిన నిమిషంలో భార్య అడ్డుచెప్పడంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నాడు. రాజకీయాల్లో చేరడం ఏమంతా మంచి నిర్ణయం కాదని, దానికన్నా ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ ఉండటమే మేలని భార్య తనను ఒప్పించిందని స్టాలోన్ వెల్లడించాడు.

'నేను రాజకీయాల్లో చేరే విషయమై నువ్వేమనుకుంటున్నావని నా భార్యను అడిగాను. 'నీకు ఏమైనా వెర్రా? ఇప్పటివరకు చాలా బావున్నావు. నిన్ను ప్రజలు ఎన్నుకోబోరు. ప్రజలతో జయజయధ్వానాలు చేయించుకోవాలన్న నెరవేరని కోరిక ఏది నీకు లేదు' అని ఆమె కాస్ల్ పీకింది' అని స్టాలోన్ చెప్పినట్టు 'డిజిటల్ స్పై' తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement