జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్‌ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది.
బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు.
డీఎన్‌ఏ విశ్లేషణ కోసం..
జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్‌ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్‌ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్‌ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు.
హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్‌తో మృతి
బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్‌కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది.
తండ్రులు వేరా?
బీథోవెన్‌కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment