30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్‌తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది.
కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు.
ఈ జనరేషన్‌లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్‌పై పెట్టడం లేదు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు.
ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్‌క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది.
ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment