సరదాగా డీఎన్‌ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు! | Woman and her Siblings go for dna Test Result Bring out Hidden Family Secret | Sakshi
Sakshi News home page

DNA test for Fun: సరదాగా డీఎన్‌ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!

Published Mon, Nov 6 2023 8:40 AM | Last Updated on Mon, Nov 6 2023 8:40 AM

Woman and her Siblings go for dna Test Result Bring out Hidden Family Secret - Sakshi

ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. 

ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్‌  సరదాగా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్‌ సాయంతో డిఎన్‌ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. 

కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్‌ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి  ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే  ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. 

ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్‌ యూజర్స్‌ను కోరింది.
ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement