మహిళలకు పురుషులతో సమానంగా అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలని పోరాటలు చేశారు. తాము పురుషులకు ఎందులోనూ తీసిపోం అని చాటి చెప్పినప్పటికీ స్త్రీలు ఇంకా పదోన్నోతుల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు కార్యాలయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరికి కలగానే మిగిలిందా? ఎందుకిలా? అంటే..ఔననే చెబుతున్నాయి అమెరికన్ సాంకేతిక అధికారి షెరిల్ శాండ్‌బర్గ్, లెర్న్‌ఇన్ డాట్ ఆర్గనైజేషన్, మిక్నిసే అండ్ కో సంయుక్తంగా నిర్వహించిన విమెన్ ఇన్ ది వర్క్ ప్లేస్ నివేదికలు. ఆ సర్వే ప్రకారం 2022లో పదోన్నతులు పొందిన ప్రతి వంద మంది పురుషుల్లో 87 మంది మహిళలు మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పొందారు. పురుషులతో సమానంగా ప్రమోషన్లు పొందాలని కోరినప్పటికీ అందులో వారు ఇంకా వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఈ గ్యాప్‌కి కారణం ఏంటంటే పని ప్రదేశాల్లో తమ సామర్థ్యాన్ని పురుషుల, స్త్రీలు ప్రూవ్ చేసుకునేదనే బట్టే ఉంటుంది. పురుషులు, స్త్రీలు తమ పనితీరుని చూపించుకోవాల్సి ఉంటుఒంది. మీకు (స్త్రీలు) మీరుగా మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోనట్లయితే వెనుకబడక తప్పదని శాండ్‌బర్గ్ సర్వే వెల్లడించింది. దీన్ని నల్లజాతీయుల పరంగా చూస్తే ఆ స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతి వంద మంది పురుషులకు కేవలం 54 మంది నల్లజాతీయులు పదోన్నతులు పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2021లో 96 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 2018, 2019 కనిపించిన 58 దగ్గరకు ఉంది. అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు నల్లజాతీయులకు ఉద్యోగావకాశాలు హామీ ఇచ్చాయి కూడా.
కాగా యూఎస్, కెనడాలలో సుమారు 276 కంపెనీలపై సర్వే చేయగా దాదాపు 33 సంస్థలు నుంచి 27 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ప్రమోషన్లు పొంది లాభపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పురుషులు ఆన్‌సైట్‌లో ఉన్నప్పుడూ మహిళలు కంటే ఎక్కువ మెంటర్‌షిప్, స్పాన్సర్‌షిప్ పొందుతారని, వారు కొత్తవి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారని లెర్ని ఇన్ డాట్ ఆర్గనైజేషన్ సహ వ్యవస్థాపకుడు సీఈవో రేచెల్ థామస్ అన్నారు. అంతేగాదు పని వాతావరణంలో ఉద్యోగుల నైపుణ్యాలు వెలికితీసేలా మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును కూడా సమీక్షించాలి, ఎక్కడ తప్పు దొర్లుతుందో గమనించాలని అన్నారు.
ఇక మెటా ఫ్లాట్‌ఫారమ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్‌బర్గ్ మాట్లాడుతూ..మహిళలే పనితీరులో కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ అసంతృప్తిగా పనిచేస్తున్నారని చెప్పడం దురదృష్టకరం. అయినా ఇలా ఉంటే మహిళలు వారు ఆశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకొనగలరు అని ప్రశ్నిస్తోంది. సామర్థ్యాన్ని పెంచుకోకుండా పురుషులతో సమాన అవకాశాలు ఎక్కడ నుంచి వస్తాయని శాండ్‌బర్గ్ అన్నారు. మహమ్మారికి ముందు మహిళలు ప్రతిష్టాత్మకంగా ఉన్నారని 2019లో ఏకంగా 80% మంది మహిళలు ప్రమోషన్లు ఆశించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment