Is the US Hiding UFOs and Aliens? - Sakshi
Sakshi News home page

భూమిపై ఎలియన్స్‌?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!

Published Sun, Jul 30 2023 10:10 AM | Last Updated on Sun, Jul 30 2023 10:55 AM

aliens on earth is usa hiding ufo - Sakshi

ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి.  అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే  ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. 

రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను దాచిపెట్టి..
తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్‌ఐడెంటిఫైడ్‌ ఏరియల్‌ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్‌సైట్ సబ్‌కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. 

‘అది జాతీయ భద్రతా అంశం’
ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్‌ఫోర్స్ మిషన్‌కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్‌ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. 

‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసు’
ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్‌ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్  ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్‌ దగ్గర లేవని పేర్కొంది. 
ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement