
వాషింగ్టన్:‘బ్రిక్స్’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 150 శాతం సుంకాల దెబ్బకు ‘బ్రిక్స్’ ముక్కలయ్యాయని సెటైర్లు వేశారు. డాలర్‌ను ఆధిక్యతను దెబ్బతీయాలని ప్రయత్నించినందుకు ఆ దేశాలకు ఇది జరగాల్సిందేనన్నారు.
‘డాలర్‌ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశాను. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150 శాతం సుంకం విధిస్తానని చెప్పాను.
మీ వస్తువులు మాకు అవసరం లేదు. నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయి’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్‌కు కూడా మినహాయింపు ఇవ్వలేదు.బ్రిక్స్ కూటమిలో భారత్,రష్యా,చైనా సహా మొత్తం పది దేశాలున్నాయి.