అప్పుడప్పుడు తవ్వకాల్లో లభ్యమయ్యే పురాతన వస్తువులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో జరిపిన తవ్వకాల్లో ఒక కార్మికుడు అత్యంత పురాతన కాలానికి చెందిన అతిపెద్ద ఏనుగు దంతాన్ని కనుగొన్నాడు. పూర్వీకులు దీనిని మముత్ అని పిలిచేవారు. ఈ దంతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు.
ఉత్తర డకోటా నగరంలోని ఒక గనిలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన ఏనుగు దంతం బయటపడింది. గనిలో జరుగుతున్న పనుల్లో పాల్గొన్న ఒక కార్మికుడు దాదాపు రెండు మీటర్ల పొడవైన తవ్వకం జరిపినప్పుడు ఈ అతిపెద్ద దంతం బయటపడింది. ఇది 10 వేల నుంచి లక్ష ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు.
యూఎస్‌లోని ఉత్తర డకోటా గనులలో కొన్ని మిలియన్ టన్నుల లిగ్నైట్ బొగ్గును వెలికితీస్తారు. ఈ బొగ్గు గనిలోనే ఈ అమూల్యమైన నిధి దొరికింది. ఈ బొగ్గు గనుల్లో ఇంతకాలం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇంత విలువైన ఏనుగు దంతం దొరకడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఏనుగులను మముత్‌లు అని పిలిచేవారు. ఇప్పుడు నాటికాలపు ఏనుగు దంతం బయల్పడటం విశేషం. దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు.
అమెరికాలోని ఉత్తర డకోటాలోని బొగ్గు గనిలో దొరికిన మముత్ ఏనుగు దంతం బరువు 22 కిలోలకు మించి ఉంది. శాస్త్రవేత్తలు మముత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు. కాగా ఈ ఏనుగుదంతాన్ని వెలికితీసిన బొగ్గు గని కార్మికుడు భారీ మొత్తంలో సొమ్ము అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment