
వాషింగ్టన్:అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతావిలియమ్స్,బుచ్‌విల్మోర్‌ల విషయమై బిలియనీర్ ఇలాన్‌మస్క్, డెన్మార్క్‌కు చెందిన సీనియర్ వ్యోమగామి యాండీ మోగెన్సెన్ మధ్య ఎక్స్(ట్విటర్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. వ్యోమగాములు నింగిలోనే ఉండిపోవడానికి బైడెన్ కారణమని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ చెప్పారు. రాజకీయ కారణాల వల్లే వారిని తిరిగి తీసుకురాలేదని అన్నారు.
ట్రంప్,మస్క్ కలిసి చేసిన ఈ వ్యాఖ్యలపై వ్యోమగామి యాండీ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు చేశారు. సునీత,విల్మోర్‌ల విషయంలో మస్క్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని యాండీ పోస్టు పెట్టారు. యాండీ పోస్టుకు మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘ఇడియట్..నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వ్యోమగాములు సునీత,విల్మోర్‌లను తీసకువస్తానని నేను కొన్ని నెలల క్రితమే చెప్పాను.
కొన్ని రాజకీయ కారణాల వల్ల బైడెన్ దీనిని పట్టించుకోలేదు’అని మస్క్ యాండీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తిరిగి స్పందించిన యాండీ ‘ఇలాన్ నువ్వంటే నాకు అభిమానం. టెస్లా, స్పేస్ ఎక్స్‌లలో నువు సాధించిన దానికి నిన్ను ప్రశంసించా.ఇది నీకు కూడా తెలుసు. అయితే సునీత,విల్మోర్‌ల విషయంలో నువు చెబుతున్నది మాత్రం అబద్ధం. వాళ్లను తీసుకురావడానికి గత సెప్టెంబర్‌లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి.
You are fully retarded.
SpaceX could have brought them back several months ago.
I OFFERED THIS DIRECTLY to the Biden administration and they refused.
Return WAS pushed back for political reasons.
Idiot.— Elon Musk (@elonmusk) February 20, 2025
నువ్వు ఇప్పుడు కొత్తగా ఏ రాకెట్‌ను ఐఎస్‌ఎస్‌కు పంపలేదు. ఎప్పటినుంచో ఐఎస్‌ఎస్‌లో ఉన్న క్రూ-9 వ్యోమనౌకలోనే వారు తిరిగి భూమికి వస్తున్నారు’అని యాండీ మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు.కాగా, గతేడాది జూన్‌లో పది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు వెళ్లిన సునీత,విల్మోర్‌లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు మార్చి మొదటి వారంలో తిరిగి భూమికి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ వ్యోమనౌకలో వారు భూమికి రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment