వాసన అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పదార్థాలను వాసన చూసి, అదేమిటో గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి వాసనను పసిగట్టి ప్రమాదాలను కూడా నివారించవచ్చు.
ఇంటిలోని విద్యుత్ వైర్ ఏదైనా ఓవర్‌హీట్ అయినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. దానిని వెంటనే పసిగడితే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొన్ని వాసననలు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఉదాహరణకు తొలకరి చినుకులు పడుతున్నప్పడు మట్టి నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు.
పెట్రోల్ వాసన, కొత్త పుస్తకాల వాసనను ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. కొందరు అయోడెక్స్, నెయిల్ పాలిష్ వాసనలను ఇష్టపడుతుంటారు. అయితే కొందరికి ఏ వాసనలు నచ్చుతాయో అవే మరికొందరికి అస్సలు నచ్చవు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసనల వెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు గ్రహిద్దాం.
సువాసన, దుర్వాసనల వెనుక..
ప్రముఖ శాస్త్రవేత్త రేచల్ ఎస్ హర్జ్ రాసిన The Scent of Desire పుస్తకంలో ఏ వాసన అయినా బాగుందని, బాగోలేదని విభజించలేమన్నారు.అయితే మనం వాసన పీల్చుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్ ప్రకారం అది బాగుందని, లేదా బాగోలేదని చెబుతుంటామన్నారు. మనం మానసిక భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఏదైనా స్మెల్ బాగుందనో లేదా బాగోలేదనో చెబుతుంటాం. దీనిప్రకారం చేస్తూ మనం ఎమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన అయినా మనకు సాధరణంగానే అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం మనకు పాజిటివ్ ఫీల్ కలిగించిన వాసనలను మనం ఇష్టపడుతుంటాం. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు మొదలైన వాటి వాసన ఈ కోవలోకే వస్తుంది. కొందరు విచిత్రమైన వాసనలను ఇష్టపడుతుంటారు. అంతమాత్రాన వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతీవాసనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీకరిస్తారు. అందుకే కొందరికి సువాసన అనిపించేది మరికొందరికి నచ్చదు.
ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్‌వర్క్ ఉన్నా..
Comments
Please login to add a commentAdd a comment