
ప్యారీ అంటే ప్రియమైనదే కాదు అందమైనది అని కూడా! వెస్ట్ర్టన్ వేర్ వేసినా సంప్రదాయ ఓణీ చుట్టినా ఇంపుగా శారీ కట్టినా కరీనా ప్యారీనా అనకుండా ఉండతరమా!!
►ఇది సింగిల్ పీస్ మ్యాక్సీ డ్రెస్. నడుము దగ్గర నుంచి మరో లేయర్ తీసుకురావడంతో ఈ డ్రెస్ అందం పెరిగింది. లాంగ్ స్లీవ్స్ దీనికి ప్రధాన ఆకర్షణ.
►షరారా డ్రెస్ మీద ఫైన్ జర్దోసీ వర్క్ చేశారు. ప్యాంట్‌కి ఫ్లోరల్ ప్రింటెడ్ లేయర్ వేసి, దాని మీద నెటెడ్ ఫ్యాబ్రిక్‌ని స్కర్ట్‌లా తీసుకున్నారు. ఈ నెట్ స్కర్ట్‌కి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ముదురు బూడిద రంగు (ఎలిఫెంట్ కలర్) అవడంతో క్లాస్‌గా కనిపిస్తోంది.
►సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపిస్తున్న ఈ లుక్ అంతా చీరలోని డిజిటల్ ప్రింట్ వల్లే వచ్చింది. మబ్బుల దొంతర వచ్చేలా నలుపు, తెలుపు కాంబినేషన్ ప్రింట్‌తో ఈ శారీని డిజైన్ చేశారు. సాయంకాలపు పార్టీలకు ఈ స్టైల్ శారీస్ బాగా నప్పుతాయి.
►ప్రింటెడ్ డ్రెసెస్‌తో మ్యాజిక్ చేయడం కరీనా స్టైల్‌లా కనిపిస్తుంది. అందుకే ఈమె ఫ్యాషన్ ఖాతాలో ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కువగా కనిపిస్తాయి. నీ లెంగ్త్ ప్రింటెడ్ ఫ్రాక్ సాయంకాలపు వేడుకలకు స్టైలిష్ లుక్‌ని తీసుకువస్తాయి.
►డిజిటల్ ప్రింట్‌తో మెరిపించిన డిజైన్ చేసిన స్కర్ట్ అండ్ టాప్. దీనికి ప్రధాన ఆకర్షణ వెడల్పాటి బెల్ట్. అలలు అలలుగా ఆకట్టుకుంటున్న ప్రింట్‌కి మధ్య వెడల్పాటి బెల్ట్‌తో పూర్తి లుక్‌ని మార్చేశారు. ఫ్యాన్సీ చెవి జూకాలు స్టైల్‌ని మరింత స్టైలిష్‌గా మార్చేశాయి.
►వెల్వెట్ బ్లౌజ్ మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి, జార్జెట్ ఫ్యాబ్రిక్ లాంగ్ స్లీవ్స్‌ని జత చేశారు. వెల్వెట్ లెహంగా మీద సన్–మూన్ కాన్సెప్ట్ వచ్చేలా మోటివ్స్‌ని థ్రెyŠ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. దీంతో ఈ గెటప్‌కి గ్రాండ్ లుక్ వచ్చింది.
►ఇది పూర్తి బ్రైడల్ డ్రెస్. వెల్వెట్ బ్లౌజ్ మీద జువెల్రీ ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టా, గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ధరిస్తే సంప్రదాయ వేడుకలకు అద్భుతమైన కళ వచ్చేసినట్టే.
భార్గవి కూనమ్
డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment