మీరా చాలా క్యూట్‌గా ఉంటుంది. మోడ్రన్ అమ్మాయి. ఆధునిక దుస్తుల్లో అదిరిపోయేలా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో శెభాష్ అనేలా ఉంటుంది.
మీరా చాలా క్యూట్‌గా ఉంటుంది. మోడ్రన్ అమ్మాయి. ఆధునిక దుస్తుల్లో అదిరిపోయేలా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో శెభాష్ అనేలా ఉంటుంది. మొత్తం మీద మీరా గొప్ప అందగత్తె. ఈ పాల బుగ్గల సుందరి చాకులాంటి అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అతను టైగర్ అంత పవర్‌ఫుల్. మీరాతో ఈ టైగర్ లవ్‌స్టోరీ ఎలా ఉంటుందో ‘బెంగాల్ టైగర్’లో చూడాల్సిందే. బెంగాల్ టైగర్‌గా రవితేజ, మీరా పాత్రను తమన్నా చేశారు. రాశీ ఖన్నా మరో కథానాయిక. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయిపోతాయి. ‘‘రవితేజ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. తమన్నా, రాశీఖన్నా ఓ హైలైట్‌గా నిలుస్తారు. బొమన్ ఇరానీ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్‌లో ఎవరూ తీయని అందమైన లొకేషన్స్‌లో ఇటీవల రెండు పాటలు చిత్రీకరించాం. వచ్చే నెల పాటలను విడుదల చేస్తాం. రవితేజ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అని నిర్మాత చెప్పారు.