ఎప్పుడైనా రెడీ! | Ready for ever! | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా రెడీ!

Oct 31 2015 10:13 PM | Updated on Sep 3 2017 11:47 AM

ఎప్పుడైనా రెడీ!

ఎప్పుడైనా రెడీ!

అతను క్లయిమేట్ లాంటోడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఒకసారి కూల్‌గా... ఆ వెంటనే హాట్‌గా... ఉంటాడు.

అతను క్లయిమేట్ లాంటోడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఒకసారి కూల్‌గా... ఆ వెంటనే హాట్‌గా... ఉంటాడు. ఎవరికైనా ఎదురెళ్తాడు. భయంతో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇలాంటి  వ్యక్తికి ఓ పెద్ద కోరిక ఉంటుంది. గూగుల్‌లో తనకంటూ నాలుగు పేజీలు ఉండాలన్నదే ఆ కోరిక. దాని కోసం సమాజంలో ఉన్న చెడుపై ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కానీ, కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది.

ఈ వార్తలో నిజం లేదని రాధామోహన్ స్పష్టం చేశారు.‘‘అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన ‘అఖిల్’ చిత్రం విడుదల వాయిదా కావడంతో ‘బెంగాల్ టైగర్’ని ముందు అనుకున్నట్టు నవంబర్ 5న రిలీజ్ చేయడం కుదరడం లేదు. విడుదల వాయిదా వేయడానికి కారణం ఇదే. నైజామ్ ఏరియాలో ‘అఖిల్’ చిత్రం, మాది ఒకరే కొన్నారు. అందుకే, రిలీజ్ డేట్స్ క్లాష్ కాకుండా చూసుకుంటున్నాం. షూటిం గంతా పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలూ పూర్తి అయ్యాయి. డేట్ కుదిరితే చాలు... ఎప్పుడైనా మా సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్నాం. ఎప్పుడు రిలీజైనా రవితేజ కెరీర్‌లో ఇది హిట్‌గా నిలుస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్, సంగీతం: భీమ్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement