దీపావళికి టైగర్ బాంబ్ | hero raviteja bengal tiger ready to realse diwali | Sakshi
Sakshi News home page

దీపావళికి టైగర్ బాంబ్

Published Mon, Sep 28 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

దీపావళికి టైగర్ బాంబ్

దీపావళికి టైగర్ బాంబ్

రవితేజ అంటే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడాయన ‘బెంగాల్ టైగర్’ గా తనదైన శైలిలో యాక్షన్‌ను, వినోదాన్నీ ప్రేక్షకులకు పంచడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా ముఖ్యతారలుగా కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

నిర్మాత మాట్లాడుతూ- ‘‘దీపావళి కానుకగా నవంబరు 5న ‘బెంగాల్ టైగర్’ను రిలీజ్ చేయనున్నాం. అక్టోబరు 17న పాటలను విడుదల చేస్తాం.  రవితేజ ఎనర్జీకి తగ్గ పాత్ర ఇది. సంగీత దర్శకుడు భీమ్స్ మంచి స్వరాలందించారు. బ్రహ్మానందం కామెడీ, బొమన్ ఇరానీ విలనిజమ్ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement