
ఐటెం సాంగా....నేనా...నో..
నేనా...ఐటం సాంగా ... అంత సీన్ లేదంటోంది 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశిఖన్నా. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ తొలి చిత్రంలో రాశిఖన్నా ఐటం సాంగ్ చేస్తోందన్న వార్తలను ఆమె ఖండించింది. ప్రస్తుతం తాను చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాననీ.. ఏ సినిమాలోనూ ఐటం సాంగ్ చేయడం లేదని రాశీఖన్నా స్పష్టం చేసింది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'జిల్' మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాననీ, అలాగే బెంగాల్ టైగర్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని తెలిపింది. జిల్ చిత్రంలో గోపీచంద్తో స్క్రీన్ పంచుకున్న ఈ అమ్మడు...'జోరు' కొనసాగుతోంది. ప్రస్తుతం కిక్ -2 , బెంగాల్ టైగర్ సినిమాల్లో రవితేజతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.