అరే అదిరిందే..! | Sakshi Chaudhary Grooves With Gopichand In 'Oxygen' | Sakshi
Sakshi News home page

అరే అదిరిందే..!

Published Thu, Dec 1 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

అరే  అదిరిందే..!

అరే అదిరిందే..!

గర్ల్ ఫ్రెండ్‌తో కలసి గాలిలో కాలర్ ఎగరేస్తూ ఓ కుర్రాడు దాబాకు వెళ్లాడు. అక్కడున్న ఓ అమ్మాయికి ఇతడి స్టైల్ తెగ నచ్చేసింది. ‘అరే అదిరిందే నువ్వు గాలిలో కాలర్ ఎగరేసి వస్తుంటే..’ అంటూ పాటందుకుంది. ఆ కుర్రాడు కాలరెగరేసి గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయితో కలసి చిందేశాడు. ఈ ముగ్గురి చిందులూ చూడాలంటే ‘ఆక్సిజన్’ రిలీజ్ వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత ఎస్. ఐశ్వర్య. గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ - ‘ఆక్సిజన్’.
 
  ఈ చిత్రంలో ‘అరే అదిరిందే..’ అంటూ శ్రీమణి రాసిన ప్రత్యేక గీతాన్ని బృందా మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతంలో సాక్షీ చౌదరి సందడి చేయనున్నారు. ఆమెతో పాటు గోపీచంద్, రాశీఖన్నా, అలీలు కాలు కదుపుతున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో పాటను డిసెంబర్‌లో పుణేలో చిత్రీకరించనున్నారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement