Sakshi Chaudhary
-
క్వార్టర్ ఫైనల్లో సాక్షి, లవ్లీనా..
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాక్షి చౌధరీ (52 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రీతి (54 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 5–0తో జజీరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 5–0తో వనెసా ఒరిట్జ్ (మెక్సికో)పై ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. ప్రీతి 3–4తో జిట్‌పోంగ్ జుటామస్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. మరో బౌట్లో విజయం సాధిస్తే సాక్షి, లవ్లీనాకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సుమయె కొసిమోవా (తజికిస్తాన్)తో నీతూ (48 కేజీలు), తుర్హాన్ ఎలిప్ నూర్ (తుర్కియే)తో మనీషా (57 కేజీలు), కిటో మాయ్ (జపాన్)తో శశి చోప్రా (63 కేజీలు), ఫాతిమా హెరెరా అల్వారెజ్ (మెక్సికో)తో నిఖత్ జరీన్ (50 కేజీలు), నవ్‌బాఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్)తో మంజు బంబోరియా (66 కేజీలు), మిజ్‌గోనా సమదోవా (తజికిస్తాన్)తో జాస్మిన్ (60 కేజీలు) తలపడతారు. చదవండి: Race Walking Championship 2023: అక్ష్దీప్ సింగ్‌కు స్వర్ణం -
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్‌గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
‘నేనెవరు’ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాం: హీరోహీరోయిన్లు
‘నేనెవరు’ చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని ఈ చిత్ర హీరో-హీరోయిన్లు కోలా బాలకృష్ణ - సాక్షి చౌదరి తెలిపారు. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటింగ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని కోలా బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు ఎంత తపన పడ్డారో తాము ప్రత్యక్షంగా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని హీరో హీరోయిన్లు తెలిపారు. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు చాలా మంచి పేరు తెస్తుందని సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ మరియు ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం... "నేనెవరు" చిత్రం సాధించబోయే విజయానికి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు.నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి సంగీతం అందించాడు. -
విడుదలకు సిద్ధమవుతున్న లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నేనెవరు'
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మిస్తుండగా.. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ విలన్‌గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. (చదవండి: పంత్ కోసం కాదట .. ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా..!) సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేనెవరు" అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు. చిత్రబృందానికి చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రలు పోషించారు. -
కామెడీ.. థ్రిల్
‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు విరాట్ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్ అయ్యాను’’ అన్నారు రాహుల్. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్. -
‘టోక్యో’ బెర్త్‌కు విజయం దూరంలో...
అమ్మాన్ (జోర్డాన్): మరో విజయం సాధిస్తే భారత మహిళా బాక్సర్లు సాక్షి చౌధరీ, సిమ్రన్‌జిత్ కౌర్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో సాక్షి (57 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 3–2తో నాలుగో సీడ్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత నిలావన్ టెచాసుయెప్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయం సాధించగా... సిమ్రన్‌జిత్ 5–0తో రిమ్మా వొలోసెంకో (కజకిస్తాన్)ను ఓడించింది. -
మా కష్టం తెరపై కనపడుతుంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, రామ్, ఇంద్ర ముఖ్య తారాగణంగా దర్శకుడు ఎం.ఎస్.ఎన్ సూర్య తెరకెక్కించిన చిత్రం ‘సువర్ణసుందరి’. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ఇంద్ర పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన తర్వాత ఇంద్ర మాట్లాడుతూ– ‘‘టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ టీమ్‌తో మరో సినిమా చేయాలని ఉంది. దర్శక–నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది. దర్శకుడు సూర్య చాలా హార్డ్‌వర్క్ చేశారు’’ అన్నారు హీరో రామ్. ‘‘టీమ్ పడిన కష్టం తెరపై తెలుస్తుంది. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు పూర్ణ. ‘‘నా కెరీర్లో స్పెషల్ చిత్రం ఇది. గ్లామర్, యాక్షన్, లవ్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను దర్శకుడు సూర్య హైలైట్‌గా తెరకెక్కించారు’’ అన్నారు హీరోయిన్ సాక్షి. ‘‘ఇది టెక్నీషియన్స్ చిత్రం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కథ డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీతో సినిమా చేశాం. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉండటంతో సినిమా విడుదల లేట్ అయింది’’ అన్నారు సూర్య. ‘‘నటీనటుల కష్టం, దర్శకుడు సూర్య టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం’’ అన్నారు సంగీతదర్శకుడు సాయి కార్తీక్. -
మూడు జన్మల కథ
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్‌తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కే ఏడాది పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్‌కు పదిలక్షలు వ్యూస్‌కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
పెళ్లి హడావిడి.. ఫుల్ కామెడీ
‘‘మన నేటివిటీ సబ్జెక్ట్స్‌ని ఆడియన్స్ ఎప్పుడూ ఆదరించారు. ఆదరిస్తారు కూడా. ‘ఊ.పె.కు.హ’ (‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి’) సినిమా కూడా నా గత చిత్రాల్లాగే రొమాంటిక్ కామెడీగా సాగిపోతుంది. ప్రతీ తెలుగువాడికి తెలిసిన సామెతని టైటిల్‌గా పెట్టాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సాక్షీ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఊ.పె.కు.హ’. ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వం వహించారు. బేబి లక్ష్మీ నరసింహా హిమ బుషిత సమర్పణలో భాగ్యలక్ష్మి నిర్మించారు. రేపు ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిధి ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘కడప నుంచి వచ్చాను. చదువుకుంది యస్వీ యూనివర్సిటీలో అయితే సినిమాను చదువుకుంది అన్నపూర్ణ స్టూడియోస్‌లో. నేను డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వైయస్సార్ గారితోనే ఉండేవాడిని. తర్వాత నా సినిమా ఓపెనింగ్స్‌కు వచ్చేవారన్న విషయం అందరికీ తెలిసిందే. డైరెక్షన్లో ఎలాంటి అనుభవం లేకపోయినా ఫస్ట్ సినిమా (‘నిధి’) ఛాన్స్ ఇచ్చిన శ్రీకాంత్‌గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక, ‘ఊ.పె.కు.హ’ విషయానికొస్తే.. సినిమాలో రాజేంద్రప్రసాద్ తమ్ముళ్లకు పెళ్లి. ఆ పెళ్లిలో కొన్ని క్యారెక్టర్స్ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా హడావిడి చేస్తుంటారు. ఆ హడావిడిలో నుంచి పుట్టే కామెడినే ఈ సినిమా. ఇందులో మొత్తం 81మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో పాపులర్ ఆర్టిస్టులు ఓ 40మంది ఉన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వీళ్లందరూ లెజెండ్స్. మంచి కామెడీ టైమింగ్‌తో సినిమాను లిఫ్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్‌ను వాళ్లు ఎక్స్ట్రార్డినరీగా చేశారు. ప్రొడ్యూసర్స్ భాగ్యలక్ష్మీ, విక్రమ్ బాగా సహకరించారు. షూటింగ్ సజావుగా సాగటానికి సహకరించిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజుగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అనూప్ పెద్ద సినిమాకు అందించే రేంజ్ మ్యూజిక్ అందించాడు. మా ‘ఊ.పె.కు.హ’ అన్ని సెక్షన్ ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎవరికి ఏం కావాలో అన్నీ మా సినిమాలో ఉంటాయి. వేసవిలో వినోదాన్ని పంచే సినిమాల్లో మాది కూడా ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. -
వంద శాతం నవ్వులు పంచుతుంది – రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో సాక్షీ చౌదరి హీరోయిన్గా రూపొందిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక. ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వంలో జెబి క్రియేషన్స్ పతాకంపై భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను రాజేంద్రప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సినిమాలు తీసేవాళ్లలో రెండు రకాలవారుంటారు. కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా సినిమా తీసేవాళ్లు ఒకరు. ఎన్ని కష్టాలైనా పడి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకునేవాళ్లు ఇంకొకరు. ‘నిధి’ ప్రసాద్ తనను తాను కాంప్లికేట్ చేసుకుని ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకుంటాడు. తనతో షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని, విడుదల తర్వాత హ్యాపీగా ఫీలయ్యేవాళ్లలో నేనూ ఒకణ్ణి. ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం. ప్రేక్షకుల డబ్బుకి వందశాతం నవ్వులు పంచుతుంది’’ అన్నారు. ‘‘స్క్రిప్ట్ పరంగా చాలా కాంప్లికేటెడ్ మూవీ ఇది. అందుకే చాలా హార్డ్ వర్క్ చేశా. చాలామంది నటీనటులు, హాస్యనటులు నటించారు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్. ‘‘సినిమా అనేది ఒక బిజినెస్. ఆడియన్స్ అంటే ముఖ్యంగా నేల టికెట్, మిడిల్ క్లాస్ బ్యాచ్. సినిమా స్టార్ట్ చేసే ముందు వాళ్లను ఆకట్టుకుంటుందా? లేదా? అని ఆలోచించాం. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు జెబి క్రియేషన్స్ అధినేత విక్రమ్. సాక్షీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నాగరాజు పాల్గొన్నారు. -
కత్తిలాంటి ఫిగరుంది!
‘మా ఆఫీసులో ఓ కత్తిలాంటి ఫిగరుంది’.. అంటూ ప్రారంభమయ్యే ‘యేంటి రాజా యూత్ ఇలా ఉంది’ టీజర్ అలరిస్తోంది. ‘పోటుగాడు’ ఫేమ్ సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ఆది శేషసాయిరెడ్డి దర్శకత్వంలో లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై ఎమ్వీఎస్. సాయి కృష్ణారెడ్డి నిర్మించారు. పర్వీన్ రాజ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని ‘నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. శేష సాయిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇదొక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. నేటి సమాజంలో యువత ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా జీవితాంతం ఒకరి తోడుగానే ఉండాలనే సందేశం ఇచ్చాం. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగ రాకేష్, ఇంద్ర, సంతోష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శంకర్, సంగీతం: కిషన్. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
నాలుగు శతాబ్దాల కథ!
చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్ మూవీస్‌కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్ వర్క్స్ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్. -
అరే అదిరిందే..!
గర్ల్ ఫ్రెండ్‌తో కలసి గాలిలో కాలర్ ఎగరేస్తూ ఓ కుర్రాడు దాబాకు వెళ్లాడు. అక్కడున్న ఓ అమ్మాయికి ఇతడి స్టైల్ తెగ నచ్చేసింది. ‘అరే అదిరిందే నువ్వు గాలిలో కాలర్ ఎగరేసి వస్తుంటే..’ అంటూ పాటందుకుంది. ఆ కుర్రాడు కాలరెగరేసి గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయితో కలసి చిందేశాడు. ఈ ముగ్గురి చిందులూ చూడాలంటే ‘ఆక్సిజన్’ రిలీజ్ వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత ఎస్. ఐశ్వర్య. గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ - ‘ఆక్సిజన్’. ఈ చిత్రంలో ‘అరే అదిరిందే..’ అంటూ శ్రీమణి రాసిన ప్రత్యేక గీతాన్ని బృందా మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతంలో సాక్షీ చౌదరి సందడి చేయనున్నారు. ఆమెతో పాటు గోపీచంద్, రాశీఖన్నా, అలీలు కాలు కదుపుతున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో పాటను డిసెంబర్లో పుణేలో చిత్రీకరించనున్నారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
‘సెల్ఫీరాజా’ సందడి
-
ఆ ఆలోచనలు...
నేటి తరం యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లితండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్వీన్ రాజు, పూజిత జంటగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేష సాయి దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభ మైంది. ఈ చిత్రానికి కెమేరా: శంకర్ కంతేటి, సంగీతం: కృష్ణ, సమర్పణ: అరుణా చలమ్ మాణిక్వేల్ -
ముచ్చటగా మూడో సినిమా
‘పోటుగాడు, జేమ్స్‌బాండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ సాక్షీ చౌదరి హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆమె తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘ప్లేయర్’ ఫేమ్ పర్వీన్‌రాజ్ హీరోగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్ సాయికృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. ఇందులో తనది మంచి పాత్ర అని సాక్షీ చౌదరి పేర్కొన్నారు. ‘‘యూత్‌ఫుల్, లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తున్నాం. ఈ నెల 18న చిత్రీకరణ ప్రారంభించనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, ఝాన్సీ, సప్తగిరి, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: కంతేటి శంకరరావు, సంగీతం: కిషన్ కవాడియా. -
సిద్ధార్థతో ఆటాపాటా!
మనోజ్‌తో ‘పోటుగాడు’, అల్లరి నరేశ్‌తో ‘జేమ్స్‌బాండ్’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు సాక్షీ చౌదరి. ప్రస్తుతం ఆమె సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ దర్శకత్వంలో బాలీవుడ్లో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. సాక్షీకి తెలుగు నుంచి మరో మంచి ఆఫర్ వరించింది. ‘జీనియస్’, ‘రామ్‌లీలా’ చిత్రాల నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’లో ఆమె నాయికగా ఎంపికయ్యారు. దయానంద్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.కె. నాయుడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా రాగిణీ నంద్వానీ నటిస్తున్నారు. దాసరి కిరణ్ మాట్లాడుతూ- ‘‘బుల్లితెర మెగాస్టార్ ఆర్.కె. నాయుడు ఇందులో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: విసు, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: మణిశర్మ, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి. -
రాజమండ్రిలో ’జేమ్స్‌బాండ్’ సందడి
కడుపుబ్బ నవ్విస్తుంది : హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షిచౌదరి కంబాలచెరువు (రాజమండ్రి) :‘జేమ్స్‌బాండ్’ నేను కాదు నా పెళ్లాం.. చిత్రం అందరినీ కడుపుబ్బ నవ్వించి, ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుటుందని చిత్ర హీరో అల్లరి నరేష్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఈ చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక షెల్టాన్ హోటల్లో జరిగినవిలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ ‘సుడిగాడు’ చిత్రం తర్వాత అంతపెద్ద హిట్ ఇచ్చిన సినిమా జేమ్స్‌బాండ్ అన్నారు. దీని తర్వాత తాను మోహన్‌బాబుతో కలిసి మామా మంచిఅల్లుడుతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్లో తాను అహానా పెళ్లంట, యాక్షన్ త్రీడీ చిత్రాలు చేశానన్నారు. అనంతరం హీరోయిన్ సాక్షిచౌదరి మాట్లాడుతూ తాను నటించిన తొలిసినిమా పోటుగాడు అయినా, జేమ్స్‌బాండ్‌తో మంచి పేరు వచ్చిందన్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. పాటలు బాగా వచ్చాయని, పేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారన్నారు. 415 థియేటర్లలో విడుదల దర్శకుడు సాయికిశోర్ మచ్చా మాట్లాడుతూ సినిమా జైత్రయాత్రను శ్రీకాకుళంలో ప్రారంభించామని, మరిన్ని రోజులు రాష్ర్టంలో కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 415 థియేటర్లలో చిత్రం విడుదల చేశామని చెప్పారు. సినిమా నిర్మాణానికి 68 రోజులు పనిచేశామన్నారు. టీవీ రైట్స్ రూ.3.50 కోట్లకు అమ్ముడైందన్నారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ ఇందులో పాటలన్నీ హిట్ అయ్యాయని, వీటిలో వజ్రాయుధం సినిమాలోని సన్నజాజి.. రీమిక్స్ పాట పేక్షకులను అలరిస్తుందన్నారు. లౌక్యం తర్వాత ఇదే.. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ లౌక్యం సినిమా తర్వాత జేమ్స్‌బాండ్ చిత్రం తనకు మరింత పేరు తెచ్చిందన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చిత్రపటానికి యూనిట్ పూలమాలలు వేసి, నివాళులర్పించింది. అనంతరం జేమ్స్‌బాండ్ చిత్రం ప్రదర్శిస్తున్న కుమారి థియేటర్‌కు యూనిట్ వెళ్లి సందడి చేసింది. సినిమాలో కొన్ని డైలాగులు చెప్పి అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్లో సినీనటి హేమ ఉన్నారు. -
జేమ్స్ బాండ్ సందడి
హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరి రాక విజయనగరం టౌన్: జేమ్స్‌బాండ్ చిత్ర యూనిట్ విజయనగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జేమ్స్‌బాండ్ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ లీలామహల్ థియేటర్ని సందర్శించి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించింది. అంతకు ముందు ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ తీసిన చిత్రాల్లో తప్పులు గుర్తించి కొత్త చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. జేమ్స్ బాండ్ చిత్రం ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది రెండో చిత్రమని తెలిపారు. తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తున్నానని తెలిపారు. దర్శకుడు సాయికిశోర్, హాస్యనటుడు ప్రవీణ్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, రైటర్ శ్రీధర్, థియేటర్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.