నిధి’ ప్రసాద్.
‘‘మన నేటివిటీ సబ్జెక్ట్స్‌ని ఆడియన్స్ ఎప్పుడూ ఆదరించారు. ఆదరిస్తారు కూడా. ‘ఊ.పె.కు.హ’ (‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి’) సినిమా కూడా నా గత చిత్రాల్లాగే రొమాంటిక్ కామెడీగా సాగిపోతుంది. ప్రతీ తెలుగువాడికి తెలిసిన సామెతని టైటిల్‌గా పెట్టాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సాక్షీ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఊ.పె.కు.హ’. ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వం వహించారు. బేబి లక్ష్మీ నరసింహా హిమ బుషిత సమర్పణలో భాగ్యలక్ష్మి నిర్మించారు.
రేపు ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిధి ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘కడప నుంచి వచ్చాను. చదువుకుంది యస్వీ యూనివర్సిటీలో అయితే సినిమాను చదువుకుంది అన్నపూర్ణ స్టూడియోస్‌లో. నేను డైరెక్టర్‌గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వైయస్సార్ గారితోనే ఉండేవాడిని. తర్వాత నా సినిమా ఓపెనింగ్స్‌కు వచ్చేవారన్న విషయం అందరికీ తెలిసిందే. డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా ఫస్ట్ సినిమా (‘నిధి’) ఛాన్స్ ఇచ్చిన శ్రీకాంత్‌గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఇక, ‘ఊ.పె.కు.హ’ విషయానికొస్తే.. సినిమాలో రాజేంద్రప్రసాద్ తమ్ముళ్లకు పెళ్లి. ఆ పెళ్లిలో కొన్ని క్యారెక్టర్స్ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా హడావిడి చేస్తుంటారు. ఆ హడావిడిలో నుంచి పుట్టే కామెడినే ఈ సినిమా. ఇందులో మొత్తం 81మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో పాపులర్ ఆర్టిస్టులు ఓ 40మంది ఉన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వీళ్లందరూ లెజెండ్స్. మంచి కామెడీ టైమింగ్‌తో సినిమాను లిఫ్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్‌ను వాళ్లు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు.
ప్రొడ్యూసర్స్ భాగ్యలక్ష్మీ, విక్రమ్ బాగా సహకరించారు. షూటింగ్ సజావుగా సాగటానికి సహకరించిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజుగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అనూప్ పెద్ద సినిమాకు అందించే రేంజ్ మ్యూజిక్ అందించాడు. మా ‘ఊ.పె.కు.హ’ అన్ని సెక్షన్ ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎవరికి ఏం కావాలో అన్నీ మా సినిమాలో ఉంటాయి. వేసవిలో వినోదాన్ని పంచే సినిమాల్లో మాది కూడా ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment