రాజేంద్రప్రసాద్ దంపతులను సన్మానిస్తున్న దృశ్యం
సాక్షి, సిటీబ్యూరో: సినీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న సమస్యలన్నీ సమసిపోతాయని, విపత్కర పరిణామాలన్నీ త్వరలోనే సర్దుకొంటాయని ‘మా’ మాజీ అధ్యక్షుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఒకరు తప్పు చేసినా అందర్నీ అంటారని, అందరికీ ఆ తప్పు అంటుకుంటుందని చెప్పారు. అలా అవకుండా చూడాల్సి బాధ్యత సినీ పరిశ్రమలోని అందరిపై ఉందన్నారు. గురువారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, విజయ చాముండేశ్వరి దంపతులకు పద్మమోహన స్వర్ణకంకణం, విశిష్ట దంపతులు పురస్కారం, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ తల్లిలాంటిదని, అందరూ గౌరవించాలని కోరారు. గాయనీ పద్మప్రియ, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్‌రెడ్డితో పాటు పలువురికి ఎక్స్‌లెన్సీ అవార్డులను అందజేశారు. సభలో పాల్గొన పలువురు ప్రముఖులు నటుడు రాజేంద్రప్రసాద్‌కు ప్రభుత్వం పద్మ పురస్కారం ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మానందం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావు, కార్యక్రమ నిర్వాహకుడు డి.యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment