వంద శాతం నవ్వులు పంచుతుంది – రాజేంద్రప్రసాద్‌ | One hundred percent laughs - Rajendra Prasad | Sakshi
Sakshi News home page

వంద శాతం నవ్వులు పంచుతుంది – రాజేంద్రప్రసాద్‌

Published Wed, Feb 21 2018 12:07 AM | Last Updated on Wed, Feb 21 2018 12:07 AM

One hundred percent laughs - Rajendra Prasad - Sakshi

నాగరాజు, ‘నిధి’ ప్రసాద్, సాక్షీ చౌదరి, రాజేంద్రప్రసాద్‌

రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో సాక్షీ చౌదరి హీరోయిన్‌గా రూపొందిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక. ‘నిధి’ ప్రసాద్‌ దర్శకత్వంలో జెబి క్రియేషన్స్‌ పతాకంపై భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను రాజేంద్రప్రసాద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సినిమాలు తీసేవాళ్లలో రెండు రకాలవారుంటారు. కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా సినిమా తీసేవాళ్లు ఒకరు. ఎన్ని కష్టాలైనా పడి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకునేవాళ్లు ఇంకొకరు. ‘నిధి’ ప్రసాద్‌ తనను తాను కాంప్లికేట్‌ చేసుకుని ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకుంటాడు. తనతో షూటింగ్‌ జరిగినంత సేపు తిట్టుకుని, విడుదల తర్వాత హ్యాపీగా ఫీలయ్యేవాళ్లలో నేనూ ఒకణ్ణి.  ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం.

ప్రేక్షకుల డబ్బుకి వందశాతం నవ్వులు పంచుతుంది’’ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ పరంగా చాలా కాంప్లికేటెడ్‌ మూవీ ఇది. అందుకే చాలా హార్డ్‌ వర్క్‌ చేశా. చాలామంది నటీనటులు, హాస్యనటులు నటించారు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక్కో క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్‌. 
‘‘సినిమా అనేది ఒక బిజినెస్‌. ఆడియన్స్‌ అంటే ముఖ్యంగా నేల టికెట్, మిడిల్‌ క్లాస్‌ బ్యాచ్‌. సినిమా స్టార్ట్‌ చేసే ముందు వాళ్లను ఆకట్టుకుంటుందా? లేదా? అని ఆలోచించాం. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు జెబి క్రియేషన్స్‌ అధినేత విక్రమ్‌. సాక్షీ చౌదరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత నాగరాజు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement