Kola Balakrishna And Sakshi Chaudhary Interesting Comments About Nenevaru Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

‘నేనెవరు’ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాం: హీరోహీరోయిన్లు 

Published Wed, Nov 30 2022 2:34 PM | Last Updated on Wed, Nov 30 2022 4:02 PM

Kola Balakrishna, Sakshi Chaudhary Talk About Nenevaru Movie

‘నేనెవరు’ చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని  ఈ చిత్ర హీరో-హీరోయిన్లు కోలా బాలకృష్ణ - సాక్షి చౌదరి తెలిపారు. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటింగ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని కోలా బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు ఎంత తపన పడ్డారో తాము ప్రత్యక్షంగా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని హీరో హీరోయిన్లు తెలిపారు.

ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు చాలా మంచి పేరు తెస్తుందని సాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ మరియు ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం... "నేనెవరు" చిత్రం సాధించబోయే  విజయానికి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు.నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై  భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి సంగీతం అందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement