లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నేనెవరు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Telugu Movie Nenevaru Release In Theaters On November 25, 2022 | Sakshi
Sakshi News home page

లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా నేనెవరు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Nov 10 2022 3:55 PM | Updated on Nov 10 2022 3:55 PM

Telugu Movie Nenevaru Release In Theaters On November 25, 2022 - Sakshi

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నేనెవరు. సాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్ణయ్‌ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని​ ఈ సినిమా నవంబర్‌ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఈ మేరకు దర్శకుడు పల్నాటి మాట్లాడుతూ ఈ మూవీ ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. కాగా కౌశల్‌ క్రియేషన్స్‌ పతాకంపై భీమినేని శివ ప్రసాద్‌-తన్నీరు రాంబాబులు సంయుక్తింగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాహుబలి ప్రభాకర్‌ విలన్‌గా నటిస్తుండగా.. రాజా రవీంద్ర, దిల్‌ రమేశ్‌, డిఎస్‌ రావు, తాగుబోతు రమేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement