'Nenevaru' Movie Locks Release Date - Love and Suspense Thriller! - Sakshi
Sakshi News home page

Nenevaru: లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేనెవరు’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, Nov 25 2022 2:08 PM | Last Updated on Fri, Nov 25 2022 3:16 PM

Nenevaru movie Release Date Out - Sakshi

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేనెవరు’. సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. పల్నాటి దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభిస్తుండగా... తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు. హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement