హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరి రాక
విజయనగరం టౌన్: జేమ్స్‌బాండ్ చిత్ర యూనిట్ విజయనగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జేమ్స్‌బాండ్ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ లీలామహల్ థియేటర్‌ని సందర్శించి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించింది. అంతకు ముందు ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ తీసిన చిత్రాల్లో తప్పులు గుర్తించి కొత్త చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
జేమ్స్ బాండ్ చిత్రం ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది రెండో చిత్రమని తెలిపారు. తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తున్నానని తెలిపారు. దర్శకుడు సాయికిశోర్, హాస్యనటుడు ప్రవీణ్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, రైటర్ శ్రీధర్, థియేటర్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
జేమ్స్ బాండ్ సందడి
Published Tue, Jul 28 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement