ముచ్చటగా మూడో సినిమా | sakshi Chowdary allari naresh third film | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడో సినిమా

Published Wed, Mar 9 2016 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ముచ్చటగా మూడో సినిమా

ముచ్చటగా మూడో సినిమా

‘పోటుగాడు, జేమ్స్‌బాండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ సాక్షీ చౌదరి హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆమె తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘ప్లేయర్’ ఫేమ్ పర్వీన్‌రాజ్ హీరోగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై  శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్ సాయికృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు.

 ఇందులో తనది మంచి పాత్ర అని సాక్షీ చౌదరి పేర్కొన్నారు. ‘‘యూత్‌ఫుల్, లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తున్నాం. ఈ నెల 18న చిత్రీకరణ ప్రారంభించనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, ఝాన్సీ, సప్తగిరి, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: కంతేటి శంకరరావు, సంగీతం: కిషన్ కవాడియా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement