‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర | Suvarna Sundari Movie Updates | Sakshi
Sakshi News home page

‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర

Published Sun, Jan 15 2023 5:41 AM | Last Updated on Sun, Jan 15 2023 8:04 AM

Suvarna Sundari Movie Updates - Sakshi

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్‌. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్‌గా విడుదలవుతోంది. విజువల్‌ పరంగా కావొచ్చు, కంటెంట్‌ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్‌ పండుగుల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement